కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇండియన్-2’ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతున్నది. సామాజిక సందేశంతో సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ (1996) చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య నటించనున్నట్లు తెలిసింది. కమల్‌హాసన్‌తో పోటాపోటీగా ఆయన పాత్రసాగుతుందని, ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఎస్.జె.సూర్య నటుడిగా రాణిస్తున్నారు.
2023-06-06T20:54:48Z dg43tfdfdgfd