SARIPODHAA SANIVAARAM | ఒక శనివారం ముందు.. నాని సరిపోదా శనివారం టీం సర్‌ప్రైజ్

Saripodhaa Sanivaaram | న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వస్తోన్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్‌ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. మేకర్స్‌ ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం తాజాగా సర్‌ప్రైజ్‌ వీడియో ఒకటి షేర్ చేశారు. 50 రోజుల్లో ఒక శనివారం ముందు.. థియేటర్లలో మాస్ వైభవానికి నాంది పలుకుదామని షూటింగ్ లొకేషన్‌ గ్లింప్స్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో గ్యాంగ్‌లీడర్‌ తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. మేకర్స్‌ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు ప్రియాంక అరుళ్ మోహన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తుండగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వస్తుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గరం గరం సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Read Also :

Kalki 2898 AD | ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ కలెక్షన్స్‌కు అదే మైనస్‌ అయ్యిందా?

Suriya | ఒకే ఫ్రేమ్‌లో సూర్య, అక్షయ్‌కుమార్‌.. సర్ఫీరా ప్రమోషన్స్‌ టైం

lavanya | రాజ్‌తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు.. లావణ్య కేసులో మరో ట్విస్ట్‌

Polimera 3 | అఫీషియల్‌ థ్రిల్లింగ్‌ న్యూస్‌.. సత్యం రాజేశ్‌ పొలిమేర 3 వచ్చేస్తుంది

2024-07-10T10:48:37Z dg43tfdfdgfd