అతడు తోపు, తురుము అనుకుని డీలా పడ్డ రాజమౌళి..అది జరిగుంటే సినిమా ఫ్లాపే, తన గోడుని మరో డైరెక్టర్ కి చెబుతూ

డైరెక్టర్ రాజమౌళి సినిమా మేకింగ్ లో తాను అనుకున్నది వచ్చే వరకు వదిలిపెట్టారు. అందుకే రాజమౌళికి పనిరాక్షసుడు, జక్కన్న లాంటి బిరుదులు వచ్చాయి.

డైరెక్టర్ రాజమౌళి సినిమా మేకింగ్ లో తాను అనుకున్నది వచ్చే వరకు వదిలిపెట్టారు. అందుకే రాజమౌళికి పనిరాక్షసుడు, జక్కన్న లాంటి బిరుదులు వచ్చాయి. ప్రతి సినిమాని రాజమౌళి ఒక యుద్ధంలా భావించి తెరకెక్కిస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. 

ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో రాజమౌళికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాంచరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ కోసం రాజమౌళి చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. కేవలం ప్లానింగ్ కోసమే కొన్ని నెలలు పట్టిందట. చిత్ర రిలీజ్ టైం లో రాజమౌళి..డైరెక్టర్ సందీప్ వంగాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. 

రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ తనకి చాలా రియల్ గా అనిపించినట్లు సందీప్ వంగ తెలిపారు. చరణ్ రూత్ లెస్ కాప్ గా అదరగొట్టేశాడు. రాజమౌళి మాట్లాడుతూ అది దాదాపు 2000 జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కించిన సీన్. చాలా పెద్ద ఫైట్ సీన్. ఇంత పెద్ద ఫైట్ సీన్ చేయాలంటే మన ఇండియన్ ఫైట్ మాస్టర్స్ వల్ల కాదేమో అని తప్పుగా అనుకున్నా. 

అందుకే హాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్స్ లో ఒకరిని ఎంచుకున్నాం. భారీ రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేశాం.హాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్ కదా.. తప్పకుండా ఇంప్రెస్ అయ్యేలా చేస్తారు.. అద్భుతంగా వస్తుంది అని అనుకున్నా.  రాంచరణ్ సీన్ కి సంబంధించిన ఐడియాని ఆయనకి చెప్పా. రఫ్ గా మీరెలా తీస్తారో షూట్ చేసి పంపమని అడిగా. ఆయన తన స్టంట్ మేన్స్ తో ఫైట్ కంపోజ్ చేసి పంపారు. ఆ వీడియో చూశాక నాకు ఏమాత్రం నచ్చలేదు. 

ఇంత టాప్ ఫైట్ మాస్టర్.. ఇంత దారుణంగా తీశారు ఏంటి అని డీలా పడిపోయా. అప్పటికి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ కొన్నిఫైట్ సీన్స్ చేస్తున్నారు. రాంచరణ్ ఇంట్రడక్షన్ గురించి కూడా సాల్మన్ కి చెప్పా. ఇంత పెద్ద సీన్ ని సల్మాన్ బాగా చేస్తాడని నేను అనుకోలేదు. అందుకే హాలీవుడ్ వాళ్ళ కోసం వెళ్లాం. అక్కడ నిరాశ తప్పలేదు. ఈ తతంగం మొత్తం జరగడానికి నెల రోజులు గడిచిపోయింది. 

ఈ గ్యాప్ లో సాల్మన్ రాంచరణ్ ఇంట్రడక్షన్ కోసం తన ఐడియాతో ఒక షూట్ చేసుకుని నాకు చూపించాడు. చాలా క్రేజీగా అనిపించింది. అప్పుడు పక్కనే ఇంత ట్యాలెంట్ పెట్టుకుని హాలీవుడ్ వరకు వెళ్లాం అని అనుకున్నా. మొదట 200 మందితో రిహార్సల్స్ చేసి ఆ తర్వాత 2000 మందితో రాంచరణ్ ఇంట్రడక్షన్ సీన్ ని సాల్మన్ ఆధ్వర్యంలో చిత్రీకరించినట్లు రాజమౌళి తెలిపారు. ఆ సీన్ లో రాంచరణ్ పెర్ఫామెన్స్, రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా సాల్మన్ కి జాతీయ అవార్డు దక్కింది. ఒక వేళ ఆ హాలీవుడ్ ఫైట్ మాస్టర్ తోనే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసి ఉంటె సినిమా ఫ్లాప్ అయి ఉన్నా ఆశ్చర్యం లేదు అని నెటిజన్లు అంటున్నారు. 

2024-07-10T12:21:24Z dg43tfdfdgfd