అనసూయ లింగమార్పిడి ... ఇకపై ఆమె కాదు అతడు...!!

ఆమె ఐఆర్ఎస్ అధికారిణి... కాదు కాదు అతడు ఐఆర్ఎస్ అధికారి. ఏమిటీ కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా..! ఇంతకాలం మహిళలా వున్న ఐఆర్ఎస్ అధికారణి కాస్త ఇప్పుడు అధికారిగా మారాడు... ఆమెను కేంద్ర ప్రభుత్వమే అతడిగా గుర్తించింది. భారత సివిల్ సర్విసెస్ చరిత్రలోనే ఓ అమ్మాయి అబ్బాయిగా మారడం ఇదే తొలిసారి... ఇలాంటి వింత సంఘటనకు  హైదరాబాద్ వేదికయ్యింది.  

వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల అనసూయ సివిల్ సర్వీస్ అధికారి. ఇండియన్ రెవెన్యూ సర్విస్ (ఐఆర్ఎస్) కు చెందిన ఈమె ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్నారు...    కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమీషనర్ కార్యాలయంలో జాయింట్ కమీషనర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె ఇప్పటివరకు ఏ సివిల్ సర్వీస్ అధికారి తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. 

అయితే ఈ ఐఆర్ఎస్ అధికారిణి ముందునుండి అమ్మాయిలా కంటే అబ్బాయిలా వుండేందుకే ఇష్టపడేవారు. కానీ సమాజం కోసమో లేక కుటుంబం కోసమో ఇంతకాలం అమ్మాయిలా కొనసాగారు... ఇకపై అలా వుండదల్చుకోలేదు. తన పేరునే కాదు లింగాన్ని కూడా అధికారికంగా మార్చుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనసూయ అభ్యర్థనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఆమె కాస్త అతడిగా మారిపోయారు. 

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి అనసూయ పేరును అనుకతిర్ సూర్యగా గుర్తించినట్లు... ఇఖపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తన లింగం, పేరు మార్పుకు సంబంధించి అనసూయ చేసుకున్న అభ్యర్థనను అంగీకరించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఆమె లింగం,పేరు మార్పిడి ప్రక్రియను పూర్తిచేసినట్లు... ఇకపై అనసూయ ఆమె కాదు అతడుగా పేర్కొన్నారు. 

మిస్ అనసూయ నుండి మిస్టర్ సూర్య వరకు : 

తమిళనాడుకు చెందిన అనసూయ చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్ ఆండ్ కమ్యూనికేషన్ చేసారు. అనంతరం సివిల్ సర్విసెస్ వైపు వచ్చారు... ఎంతో కష్టపడి చదివి ఐఆర్ఎస్ సాధించారు. 2013 లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్ గా పనిచేసారు...2018 లో పదోన్నతిపై డిప్యూటీ కమీషనర్ గా పదోన్నతి పొందారు. 

అయితే గతేడాది హైదరాబాద్ లోని కస్టమ్స్ ఎక్సైజ్ ఆండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ చీఫ్ కమీషనర్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఇక్కడ జాయింట్ కమీషనర్ గా పనిచేస్తున్నారు. ఇలా ఉన్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె తాజాగా అతడిలా మారిపోయారు. 

గత 30 ఏళ్లుగా అమ్మాయిలా వున్న అనసూయ ఒక్కసారిగా అబ్బాయి సూర్యలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇది సూర్యకు ఎంతో సంతోషాన్ని కల్గించివుంటుంది.... ఎందుకంటే ఇంతకాలం ఇష్టం లేకపోయినా అమ్మాయిలా బ్రతికి... ఇప్పుడు ఇష్టపడ్డట్లు అబ్బాయిలా మారారు.   ఇకపై తనకు నచ్చినట్లు అబ్బాయిలా నడుచుకోవచ్చు... ఇష్టమైన వేషధారణలో వుండొచ్చు. తన జీవితం తనకు నచ్చినట్లు మారింది కాబట్టి ఈ ఐఆర్ఎస్ ఖుషీగా వుండివుంటారు. 

2024-07-10T10:51:03Z dg43tfdfdgfd