అప్పుడు నమ్మరేమో..

తన పెండ్లి గురించి వస్తున్న వార్తలపై మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి స్పందించింది. ఇలాంటివి ఎవరు, ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని పెదవి విరిచింది. ‘ఈ మధ్య నా పెండ్లి గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వారానికో పెండ్లి చేసేస్తున్నారు. ఒకసారి డాక్టర్‌తో అయిందని, మరోసారి బిజినెస్‌మ్యాన్‌తో జరిగిందని.. ఇలా లెక్కలేనన్నిసార్లు నాకు పెండ్లి చేస్తున్నారు. నాకు ఇన్ని పెండ్లిళ్లు ఎప్పుడయ్యాయా అనిపిస్తుంటుంది.

ఒకవేళ నిజంగా చేసుకున్నప్పుడు.. దాన్ని కూడా పుకారు అనుకుంటారేమో’ అని తన పెండ్లి వార్తలపై స్పందించింది తమన్నా! ప్రణాళికాబద్ధంగా కెరీర్‌ను మార్చుకోగలిగితే నటీమణులు కూడా సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో కొనసాగుతారని, ఈ విషయంలో కరీనా కపూర్‌, టబు తనకు ఆదర్శమని చెబుతున్నది. ‘ఈ ఇద్దరి సినిమాలు చూస్తూ పెరిగాను. టబు అంటే నాకు చాలా ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ఆమె తన కెరీర్‌ను మలుచుకున్న తీరు అద్భుతం. నేనూ అదేమార్గంలో ప్రయాణిస్తాన’ని చెప్పుకొచ్చింది తమన్నా.

2023-03-18T19:19:36Z dg43tfdfdgfd