NITHYANANDA | అమెరికాకు నిత్యానంద బురిడీ.. కైలాసం దేశం పేరుతో 30కి పైగా నగరాలతో ఒప్పందాలు

Nithyananda | న్యూయార్క్‌, మార్చి 18: తనకు తాను దైవస్వరూపంగా ప్రకటించుకొన్న నిత్యానంద అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడీ కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన ‘యునైడెట్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’ పేరుతో సాంస్కృతిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొన్నాడని అమెరికా మీడియా సంస్థ ఫాక్స్‌న్యూస్‌ తాజాగా వెల్లడించింది.

‘సిస్టర్‌ సిటీ’ పేరుతో చేసుకొన్న ఈ ఒప్పందాలపై అమెరికాకు చెందిన 30 నగరాల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు కైలాస వెబ్‌సైట్‌లో ఉన్నదని పేర్కొన్నది. కల్పిత దేశం కైలాసతో సిస్టర్‌ సిటీ ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్టు న్యూజెర్సీలోని నెవార్క్‌ నగరం ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నెవార్క్‌ నగరం, కల్పిత యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస మధ్య ఈ ఏడాది జనవరి 12న సిటీ హాల్‌ వేదికగా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు చేసుకొన్న నగరాల జాబితాలో రిచ్‌మండ్‌, వర్జీనియా, డాటన్‌, ఓహియో, ప్లోరిడా వంటి నగరాలు ఉన్నాయి.

2023-03-18T19:54:46Z dg43tfdfdgfd