అంగన్‌వాడీ చిన్నారులకు ఆంగ్లంలో విద్య

  • ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు గీత, అంజలి
  • అంగన్‌వాడీల్లో ఆకట్టుకున్న ప్రీ స్కూల్‌ మేళా

ఊట్కూర్‌, మార్చి 18: చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు గీత, అంజలి అన్నారు. శనివారం మండలంలోని ఎడవెల్లి, అమీన్‌పూర్‌ అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రామస్తులు, తల్లిదండ్రులను ఆహ్వానించి ప్రీ స్కూల్‌ మేళా నిర్వహించారు. చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ, మానసిక, శారీరకాభివృద్ధితోపాటు ఆంగ్ల మాధ్యమంలో విద్య నేర్పించేందుకు అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ ఎడవెల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు అధికారుల వేషధారణతో ముస్తాబై అలరించారు. కార్యక్రమంలో సర్పంచులు శిరీష, యశోద, ఎంపీటీసీ అనిత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

నర్వ మండలంలో..

నర్వ, మార్చి 18: మండలంలోని రాయికోడ్‌ అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌ అనురాధ ఆధ్వర్యంలో శనివారం ప్రీ స్కూల్‌ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుశీల, సూపర్‌వైజర్‌ అరుణ, ఆయాలు శివపార్వతి, లలిత, చిన్నారుల తల్లులుపాల్గొన్నారు.

కృష్ణ మండలంలో..

కృష్ణ, మార్చి 18: మండలంలోని ఆలంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం ప్రీస్కూల్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటలు ఆడించి, పాటలు పాడించారు. చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి మిడిమిడి జ్ఞానంతో పాఠాలు బోధించి ఆకట్టకున్నారు. కార్యక్రమంలో సీడీపీవో సరోజినీ, సూపర్‌వైజర్‌ అమ్మక్క, అంగన్‌వాడీ టీచర్లు రాఘసుధ, శరణమ్మ, సహాయకురాలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న అంగన్‌వాడీ మేళా

ధన్వాడ, మార్చి 18: మండలకేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం చిన్నారులకు నిర్వహించిన ప్రీ స్కూల్‌ మేళా పలువురిని ఆకట్టుకున్నది. టీడబ్ల్యూవో వేణుగోపాల్‌, ఎంపీటీసీ మాధవి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణపేట సీడీపీవో శ్రీలత, ప్రథమ్‌ సంస్థ ప్రతినిధి హారిక, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు వెంకటకమళ, చంద్రకళ, ఆంగన్‌వాడీ టీచర్లు నిర్మల, రాణి, శ్రీదేవి, సంతోష, భూదేవి, శారద, శ్రీలత పాల్గొన్నారు.

2023-03-18T23:50:05Z dg43tfdfdgfd