కూసుమంచిలో పెండ్లింట విషాదం

కూసుమంచిలో పెండ్లింట విషాదం

కూసుమంచి, వెలుగు :  ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో తెల్లారితే కూతురి పెండ్లి ఉందనగా ఓ తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం...అర్జున్​ఖమ్మంలోని హెల్త్​ డిపార్టుమెంట్​లో జూనియర్​ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. ఈయన కూతురు పెండ్లి ఈనెల18న పెట్టుకున్నారు. అందరికీ  కార్డులు కూడా పంచారు.

17వ తేదీ రాత్రి 7.15 గంటలకు ప్రదానం ( పెండ్లికి ముందు పిల్లగాడి బంధువులు, కుల పెద్దలు నిర్వహించే కార్యక్రమం) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే, 16 తేదీ రాత్రి 10 గంటల సమయంలో అర్జున్​కు గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన ఫ్యామిలీ మెంబర్స్​ వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించగా, పెండ్లి చూసి పోదామని వచ్చిన బంధువులతో పాటు పెండ్లికొడుకు, వారి చుట్టాలు చావుకు వచ్చి నివాళులర్పించి పోయారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-03-18T03:57:57Z dg43tfdfdgfd