చూడచక్కని సాహితీ ‘సున్నితం’

అనువాద యుగం నుంచి ఆధునిక యుగం వరకు తెలుగు సాహిత్యంలో అనివార్య మార్పులు అనేకం చోటుచేసుకున్నాయి. అటువంటి చారిత్రాత్మకమైన మార్పులే నేటి ఆధునిక సాహిత్య వికాసానికి దోహదపడ్డాయి. పరిణామ సహజమైన భాషా సాహిత్యాలు, సామాజికాభివృద్ధికి సాధనాలుగా ఉపకరిస్తూనే ఉన్నాయి. రూపం, గుణం, రీతి, నడక, వస్తువు, విన్యాసం మొదలైన అంశాల్లో చిన్నచిన్న మార్పులు తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిపెట్టాయి.

ప్రక్రియాపరమైన ప్రయోగాత్మక మార్పులే తెలుగు సాహిత్యాన్ని మూడుసార్లు జ్ఞానపీఠంపై అధిష్టింపజేశాయి. ఇలా ఆధునిక తెలుగు సాహిత్యం నాటినుంచి నేటివరకు అనేక ప్రక్రియలుగా విరాజిల్లుతున్నది. పద్యం నుంచి నానీల వరకు జరిగిన తెలుగు సాహిత్య పరిణామక్రమం ఏ ఇతర భాషల్లోనూ జరిగి ఉండకపోవచ్చు. ఏ ప్రక్రి య అయినా అలవోకగా తనలో కలుపుకొని పోగల అరుదైన లక్షణం తెలుగు భాషకే ఉన్నది. కనుక ద్విపదలు, గీత పద్యాలు, తరువోజులు, మధ్యాక్కరలు వంటివి మినహా మిగతా వృత్తాలన్ని సంస్కృత, కన్నడాది, భాషా సాహిత్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. ఆ తర్వాత పాశ్చాత్య భాషా సంస్కృతుల ప్రభావంతో తెలుగులోకి ఖండకావ్యాల వంటివి ప్రవేశించాయి. ముఖ్యంగా ఆంగ్లభాష సాహిత్యాల ప్రభావంతో తెలుగు సాహిత్యంలో ప్రక్రియ పరంగా విప్లవాత్మక మార్పు లు వచ్చాయని చెప్పవచ్చు. అది మన తెలు గు సాహిత్య విస్తృతికి ఇతోధికంగా దోహదపడింది.

కథానిక, వచన కవిత, స్కెచ్‌, వ్యాసం, జీవిత చరిత్ర, స్వీయచరిత్ర వంటివి కూడా ఆంగ్ల భాషా ప్రభావంతో వచ్చినవే. ఇక రుబాయి, గజల్‌ వంటివి అరబ్బీ, ఉర్దూ, భాషల నుంచి, హైకూలు జపాన్‌ భాష నుంచి స్వీకరించబడ్డాయి. 1872 నుంచి ఇప్పటివరకు మినీ కవితా ప్రవేశంతో సున్నితం, సరళ శతకం, రెక్కలు, నానీలు, వామన కవితలు సొంత భాషా ప్రక్రియలుగా నిలదొక్కుకుంటున్నాయి.

ఆధునిక యుగంలో ఏ మాత్రం విశ్రాంతి దొరకని జీవన గమనం కొనసాగుతున్న సందర్భంలో ఏ సాహిత్య ప్రక్రియనైనా నిడివిని బట్టి ఆదరిస్తున్నది. అందుకే అవసరాన్ని బట్టి ఆవశ్యకమైన నూతన సాహిత్య ప్రక్రియలు మొలకెత్తుతూనే ఉన్నాయి. అలా 2020లో సున్నితం సరళ శతకం నూతన తెలుగు సాహి త్య ప్రక్రియ రూపకల్పన చేశాను. పరిణామ క్రమంలో సాహిత్యం కూడా పరిణామం చెందిన విషయాన్ని దృష్టి లో పెట్టుకొని కవిత్వాన్ని కూడా సులభతరం చేసి పద్యం రాయలేని వారికి సరళంగా పద్యాన్ని రాసిన అనుభూతిని నింపేలా రూపొందించాలన్న తపనే సున్నితం సరళ శతకం ప్రాదుర్భావానికి మూల కారణమైంది.

‘వాక్యం రసాత్మకం కావ్యం’ అనే సంస్కృత లాక్షిణికుడు విశ్వనాథుని నిర్వచనానికి ఇప్పుడు మనం సరళం, పదం, రసాత్మకం కావ్యం అని భాష్యం చెప్పుకోవాలి. అంటే కవిత్వానికి ఆ స్థాయిలో క్లుప్తత, గాఢత, ప్రాధాన్యం, పెరిగిందని చెప్పడమే. నాకు తెలుగుభాషపైన మక్కువతో, సాహిత్యాన్ని సులభతరంచేసి సామాన్యులు కూడా రాయగలిగేలా ఉండాలని ఈ ప్రక్రియను రూపొందించాను.

తెలుగు సాహిత్యంలో నూతన తెలుగు సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం పద్యం లాంటిదే. మకుట నియమం తో, సరళంగా, సులభంగా, అందరూ ఈ రెండేండ్ల కాలంలో సున్నితం కవులు, సున్ని తం బాలకవులు, సున్నితం కవయిత్రులతో 12 కావ్యాలు వెలువడ్డాయి. రెండు కావ్యాలు పాఠశాల విద్యార్థినులు రాసిన సున్నితాలు, తెలుగు ఉపాధ్యాయుల, ఉపాధ్యాయినీల సం పాదకత్వంలో వచ్చాయి. నా సంపాదకత్వంలో ‘తేనె ఊటల తెలుగు’ పేరుతో 130 మంది సున్నితం కవులు, బాలకవుల, కవయిత్రుల, రచనల భాగస్వామ్యంతో ప్రముఖుల, సాహితీవేత్తల ముందు మాటలతో వెలువడింది. సున్నితం ప్రక్రియ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నది. మరో 10 మంది కవులు కవయిత్రులు గ్రం థాలను వెలువడించడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ముద్రణలో ఉన్నాయి. సున్నితం సరళ శతకం ప్రక్రియలో పుస్తకాలను ఎంపిక చేసి సాహితీ బృందావన విహార వేదిక నుంచి పుస్తక పురస్కారాలు ఇచ్చాం. సాహితీ బృందావన విహార వేదిక నుంచి సున్నితం ప్రక్రి య ద్వితీయ వార్షికోత్సవం సందర్భం గా.. ప్రతి శుక్రవారం సామాజిక అంశాల తో ఎంతోమంది కవులు వాట్సప్‌ గ్రూపు వేదికగా రాస్తున్నారు. సమీక్షకులు సమీక్షలు అందించి ప్రోత్సహిస్తున్నారు. సమాజసమస్యలు, మానవసంబంధాలు, ప్రకృతి పరిశీలన, సామాజిక అధ్యయ నం, ఆధ్యాత్మికం, సాహిత్యం, తెలుగు భాషల గురించి. రాసేకవిత్వం కాలానికి నిలబడుతాయి. సున్నితం సరళశతకం నియమాలు, సున్నితాలు ఆవిష్కరణ మొత్తం నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో మూడు పదాలు రావాలి. నాలుగవ పాదంలో చూడచక్కని తెలుగు సున్నితంబు అనే మకుటంతో ముగుస్తుంది. సరళ వచనంలో…

రైతుబిడ్డగాను రేయిశీ బవళ్ళును

మరువలేదు వారు మాననీయుండు

తెలుగుభాషమీద తరగనిమమతలు

చూడచక్కని తెలుగు సున్నితంబు!!

పంచెకట్టులోన అచ్చ తెనుగువాడు

పలుకులోననెంత మధురమొలుకు

కవులనాదరించి పుస్తకాలజదువు

చూడచక్కని తెలుగు సున్నితంబు

సరళ పదాలతో సరళ శతక పద్య ప్రక్రియ మరొక పద్ధతిలో రాయవచ్చు మాత్రాఛందస్సులో మొత్తం నాలుగు పాదాలుంటాయి. ప్రతి పాదంలో పదహారు మాత్రలు మాత్రమే రావాలి. అన్ని పాదాలు కూడా సమాన మాత్రలతో ఉండాలి. 4వ పాదం మకుట నియమంతో పూర్తి చేయవలసి ఉంటుంది. మాత్రానియమ సహిత ఛందోబద్ధ సున్నితాలు (16 మాత్రలు చొప్పున)

శక్తివినీవే! శాంభవి నీవే!

కాళిక రావే! భద్రతనీవే!

నైవేద్యములను ఆరగింప వే!

చూడచక్కని తెలుగు సున్నితంబు

కుంకుమ పూజలు నీకేతల్లీ!

కూతురునీవని కొలుతుము తల్లీ!

మారెమ్మ మైసమ్మ మహంకాళి!

చూడచక్కని తెలుగు సున్నితంబు

కుండ జ్యోతులు వెలిగింతునమ్మా!

పొర్లు దండాల చేరెదనమ్మా!

ఊరడి తంతును జరిపెదమమ్మా!

చూడచక్కని తెలుగు సున్నితంబు

పద్యం రాయలేకపోతున్నాం అనేవారికి సులభతరంగా ఉండి పద్యం రాస్తున్నామనే భావన కలిగిస్తుంది. బావ పరిపుష్టితో మకుటాన్ని అన్వయించి రాయాలి నాలుగో పాదం లో మకుటం చూడచక్కని తెలుగు సున్నితం బు అని ముగుస్తుంది. ఇలా తెలుగు భాషను సుసంపన్నం చేసే నా ప్రయాణంలో సున్నితం సరళశతకం కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయంగా భావిస్తున్నాను.

– నెల్లుట్ల సునీత

79894 60657

2023-03-18T19:20:01Z dg43tfdfdgfd