ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు..

ఢిల్లీలో ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు..

ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటం ఊరేగింపు నిర్వహించారు. ఘటం ఊరేగింపును హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. పోతరాజులతో కలిసి డ్యాన్స్ చేశారు అంజన్ కుమార్. 

ఢిల్లీలో 10 ఏళ్లుగా అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. షాడమాసంలో బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైందన్నారు బండారు దత్రాత్రేయ. లాల్ దర్వాజా బోనాల కమిటీ ఢిల్లీలోనూ ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-10T07:01:36Z dg43tfdfdgfd