పచ్చటి వనాల్లోనే ప్రథమ వేడుక

  • పుట్టిన రోజు వేడుకలకు వేదికగా పార్కులు
  • చిన్నారుల ఫొటో షూట్‌లు, ఈవెంట్లు
  • గ్రీనరీ ట్రెండ్‌కే తల్లిదండ్రుల ప్రాధాన్యం

సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/కందుకూరు : బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారుల ప్రథమ జన్మదిన వేడుకలను పచ్చటి వనాల్లో నిర్వహించేందుకు మక్కువ చూపుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, హరితవనాలవైపు అడుగులేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో నాటిన మొక్కలు.. అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో పట్టణ పార్కులను సుందరీకరణ చేసిన సందర్భంగా చిన్నారుల పుట్టిన రోజు వేడుకలకు వేదికలుగా నిలుస్తుండటం విశేషం.

ఆకుపచ్చని వేదికపై ఫొటో షూట్‌..

  • కాలనీల్లో ఉన్న పార్కులను అందంగా తీర్చిదిద్దడంతో బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఫొటో షూట్‌లకు వేదికలుగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా అనేక గ్రీనరీలను చుట్టి వస్తున్నారు. ప్రకృతి ఒడిలో ఎదురయ్యే ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నారు.
  • అక్కడ చిన్నారులను విభిన్నంగా ఫొటోలు తీస్తున్నారు. పిల్లలకు కనీసం ఆరు నుంచి పది జతల డ్రెస్సులతో విభిన్న స్టిల్స్‌ తీసుకుంటున్నారు. అందులో డాక్టర్‌, పోలీస్‌, లాయర్‌, సంప్రదాయ దుస్తుల వేశాధారణలో చిన్నారులను ఫొటోలు తీసి మధుర జ్ఞాపకంగా పదిలపరుచుకుంటున్నారు.

బోసిపోయిన పార్కే.. నేడు పచ్చబడింది

ముషీరాబాద్‌లోని మా ఇంటి దగ్గరి పార్కు బోసిపోయి ఉండేది. అందువల్ల మేము నారాయణగూడలోని వైఎంసీఏ పార్కుకు వెళ్లేవాళ్లం. ఒకప్పుడు బోసిపోయిన పార్కే.. నేడు గ్రీనరీతో నిండుకొనడంతో ఈ పార్కుకే వెళుతున్నాం. గతంలో చెత్తాచెదారంతో ఉండే పార్కులను తెలంగాణ ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతున్నది. కాలనీవాసులు ఎంతో సంతోషిస్తున్నారు.

నీతిక, ప్రశాంత్‌

2023-03-18T19:14:59Z dg43tfdfdgfd