పేపర్ లీకేజీ కేసు : ముగిసిన రెండో రోజు విచారణ

పేపర్ లీకేజీ కేసు : ముగిసిన రెండో రోజు విచారణ

పేపర్ లీకేజీ కేసులో  సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరెస్ట్ అయిన తొమ్మది మంది నిందుతులను చంచల్ గూడా జైల్లో సిట్ రెండవ రోజు 7 గంటలపాటు విచారించింది. ఈ విచారణలో నిందితుల నుండి పలు కీలక విషయాలను సిట్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. లీకేజీ వ్యవహారంలో రాజశేఖర్ పాత్రపై కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది.  పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలఫై  సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. వాట్సప్ రిట్రీవ్ తో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. ప్రవీణ్ నుంచి పేపర్ రేణుకకు చేరిన అనంతరం రాజేశ్వర్, రాజేందర్ కు ఇచ్చిన అంశంలో రేణుకను ప్రశ్నించింది సిట్.

ఈ విచారణలో ప్రవీణ్ కు తెలియకుండా ఇతరులకు పేపర్ ను ఇవ్వడానికి రేణుక డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.  పేపర్ మరికొంత మందికి ప్లాన్ ప్రకారం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా అధికారులుల గుర్తించారు. అయితే ఈ పేపర్ లీకేజీపై  ఇప్పటి వరకు రేణుక ఎంతమందితో డీల్ మాట్లాడింది. ఎన్ని పేపర్స్ అమ్మకానికి ప్లాన్ చేసింది.  అనే కోణంలో అధికారులు విచారణ చేశారు. వీటిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.  ఈ కేసులో నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఆరు రోజుల కస్టడీకి మాత్రమే నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. నిందితులను ఈనెల 23 వరకు విచారణ చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-03-19T14:14:02Z dg43tfdfdgfd