బాసరలో అక్షరాభ్యాసానికి బదులుగా నాలుకపై బీజాక్షరాలు .. కొత్త పోకడపై పూజారులు ఆగ్రహం

అనాదిగా వస్తున్న ఆచారాలు, పద్దతులను ప్రజలు తమకు వీలైనట్లుగా మార్చుకోవడం, లేదంటే తమకు కొత్తగా వచ్చిన ఆలోచనల ప్రకారం అమలు చేయాలనే ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొడుతూ ఉంటాయి. నిర్మల్(Nirmal) జిల్లా బాసర(Basara) శ్రీజ్ఞానసరస్వతిదేవి కొలువైన పుణ్యక్షేత్రంలో ఓ ఆశ్రమం నిర్వాహకులు గురువారం ఓ చిన్నారికి అక్షరాతభ్యాసం చేయించడానికి బదులుగా నాలుకపై బీజాక్షరాలు రాయించారు.నిత్యం ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా సరస్వతిమాత ఆలయానికి వచ్చిన భక్తులు తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. కాని ఆశ్రమం పేరుతో దాని నిర్వాహకులు ఈవిధంగా ప్రవర్తించడంపై ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే ఇలాంటి విధానాలు సరైనవి కాదని ఆశ్రమం నిర్వాహకుల్ని నిలదీస్తే వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆలయ ఈవోకి ఫిర్యాదు చేశారు. ఆగమశాస్త్రంతో పాటు పురాణాల్లో కూడా ఇలాంటి పద్దతి ఎక్కడా లేదంటూ కేవలం కాళిదాసు(Kalidasu)కు మాత్రమే అమ్మవారు నాలుకపై బీజాక్షరాలు రాశారని దాన్ని అడ్డుపెట్టుకొని ఆశ్రమం నిర్వాహకులు ఈ కొత్త పోకడను తెరపైకి తేవడం సరికాదని హెచ్చరించారు.

అక్షరాభ్యాసానికి బదులు బీజాక్షరాలు..

ఈమధ్య కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సంప్రదాయాలకు విరుద్దంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు ఆనవాయితీగా మారుతోంది.నిర్మల్ జిల్లా జ్ఞానసరస్వతిదేవి కొలువైన బాసర పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇక్కడ కొందరు ఆశ్రమం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కాకుండా నాలుకపై భీజాక్షరాలు రాయించారు. దీంతో సరస్వతిదేవి ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు సంప్రదాయంగా వస్తున్న అక్షరాభ్యాసానికి బదులుగా ఇలా చేయడం ఏమిటని ఆశ్రమం నిర్వాహకుల్ని ప్రశ్నించారు. అయితే దీనిపై వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు.

ఆగమశాస్త్రానికి విరుద్దం..

బాసర పుణ్యక్షేత్రంలో ఆలయ సంప్రదాయాలకు విరుద్దంగా ఆగమశాస్త్రంలో ఈ విధానం ఎక్కడా లేదని బీజాక్షరాలు రాయడం ఏమిటని మండిపడుతున్నారు.శాస్త్రీయంగా వస్తున్న అక్షరాభ్యాస కార్యక్రమానికి భిన్నంగా నాలుకపై బీజాక్షరం రాస్తూ అక్షర స్వీకార కార్యక్రమం చేపట్టింది. పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఆగమశాస్త్రంతో పాటు పురాణాల్లోనూ ఇలాంటి విధానం ఎక్కడా లేదని, కాళిదాసుకు మాత్రమే అమ్మవారు నాలుకపై బీజాక్షరాలు పూజారులు చెబుతున్నారు.ఇలాంటి పరిణామాలను ప్రోత్సహించడం సరికాదని తల్లిదండ్రులు గ్రహించాలని సూచిస్తున్నారు.

Viral Puzzle: మీకు లెక్కలు వచ్చా.. అయితే ఈ పజిల్ ను 15 సెకన్లలోపు పూర్తి చేయండి

తగ్గేదేలేదు..

ఇదే కాదు సరస్వతి మాలాధారణ వేసుకున్న భక్తులు కూడా ఆలయానికి కాకుండా ఆశ్రమానికి వెళ్లడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పూజారులు. పురాణాలు, ఆగమశాస్త్రానికి విరుద్దంగా నిర్వహించే ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ..సంప్రదాయాలకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఆలయ పూజారులు ర్యాలీగా వెళ్లి ఈవోకి మెమోరాండం సమర్పించారు.

2024-07-10T10:59:12Z dg43tfdfdgfd