మొదటిసారి పూర్తి చేతులు ‘అతికించారు’!

ముంబై, మార్చి 18: శస్త్ర చికిత్స ద్వారా ఆసియాలో తొలిసారి పూర్తిగా రెండు చేతులు అతికించుకున్న వ్యక్తిగా రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన ప్రేమ రామ్‌(33) నిలిచారు. భారత వైద్య చరిత్రలో మైలు రాయిగా భావించదగ్గ ఈ ఆపరేషన్‌ను ముంబైలోని గ్లోబల్‌ దవాఖాన వైద్యులు దిగ్విజయంగా పూర్తి చేశారు. దశాబ్దం క్రితం పొలంలో కరెంట్‌ షాక్‌కు గురైన రామ్‌ రెండు చేతులూ కోల్పోయాడు. శస్త్ర చికిత్స అనంతరం అతడికి ఫిజియోథెరపీ ప్రారంభించారు. 18-24 నెలల్లో అతడి చేతులు పని చేసే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు.

2023-03-18T22:35:05Z dg43tfdfdgfd