రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్.. సీరియల్ గా సాగుతున్న ట్విస్టులు

రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో ట్విస్ట్.. సీరియల్ గా సాగుతున్న ట్విస్టులు

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో రాజ్ తరుణ్ కేసు మరో ట్విస్ట్ తిరిగింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య  రాజ్ తరుణ్, మాల్వీపై రెండో సారి ఫిర్యాదు చేసింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు మరికొన్ని ఆధారాలు ఇచ్చింది లావణ్య. ఫిర్యాదు పరిశీలిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.

  ఇదిలా ఉంటే  తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందంటూ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించింది. గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. జ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదని చెప్పింది మాల్వి .     ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఫిర్యాదులో తెలిపింది.  

రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు : లావణ్య

హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

ప్రేమలో ఉన్నమాట నిజమే కానీ.. : రాజ్ తరుణ్

 గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట నిజమేనని అంగీకరించిన యంగ్ హీరో, కానీ ఇప్పుడామె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందన్నాడు. అంతేకాదు లావణ్యకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశాడు..

Also Read:కథ కుదిరిందా అఖిల్! తనయుడి కోసం నాగ్ సెట్ చేసిన రూరల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ..డైరెక్టర్ ఎవరంటే?

©️ VIL Media Pvt Ltd.

2024-07-10T06:16:28Z dg43tfdfdgfd