అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘కేజీఎఫ్’ నిర్మాతలు తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని అంటున్నారు.
తొలిభాగంలో సలార్‌గా, రెండో భాగంలో దేవాగా ఆయన పాత్రను డిజైన్ చేశారని సమాచారం. తొలిభాగం ైక్లెమాక్స్‌లో దేవా పాత్రను రివీల్ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు. ఇదిలావుండగా ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది.
2023-03-18T22:34:49Z dg43tfdfdgfd