షూటింగ్ చూడ్డానికి వెళ్తే.. పెళ్లి చేసుకుంటావా అన్నాడు.. స్టార్ డైరెక్టర్ క్యూట్ లవ్ స్టోరీ..

ఆయన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాస్ డైరెక్టర్.. మహేష్ బాబులాంటివారికి కూడా లైఫ్ ఇచ్చిన గ్రేట్ డైరెక్టర్.. హీరోను కూడా నెగెటీవ్ శేడ్స్ లో చూపించే డిఫరెంట్ డైరెక్టర్.. మరి ఈ దర్శకుడు పెళ్ళి కూడా అంతే వింతగా అయ్యిందంటే నమ్ముతారా..? అవును. ఇంతకీ ఎవరా దర్శకుడు. 

ఆంధ్రాలో ఎక్కడో ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది. చుట్టు జనాలు షూటింగ్ చూడ్డానికి వచ్చారు. ఈసినిమాకు డైరెక్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఇప్పటి స్టార్ డైరెక్టర్. అప్పుడు మాత్రం అతను అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. అయితే.. తన ఫ్రెండ్ సినిమాను ఘోస్ట్ డైరెక్ట్ చేయడానికి వచ్చాడు. షూటింగ్ జరుగుతున్న టైమ్ లో.. చుట్టు ఉన్న జనాల్లో ఒక అమ్మాయి కనిపించింది. ఈ దర్శకుడిని ఆకర్షించింది. ఏ దర్శకుడినైనా ఓ అమ్మాయి ఆకర్శిస్తే.. వెంటనే హీరోయిన్ గా చేస్తాడులే అనుకుంటారు. కాని ఈయన మాత్రం నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు..? 

40 లక్షలు సాయం.. నటుడు పొన్నంబలంకు ప్రాణం పోసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. క్లాస్ హీరోలకు కూడా మాస్ ఇమేజ్ ను ఇవ్వగల దిగ్రేట్ పూరి జగన్నాథ్. అవును డైరెక్టర్ పూరి  డైరెక్షన్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో.. ఆయన రియల్ లైఫ్ స్టైల్ కూడా అంతే చిత్రంగా ఉంటుంది. ఆయన లవ్ స్టోరీ కూడా.. అంతే విచిత్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యులో వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. 

 

పూరీ మాట్లాడుతూ.. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చేతిలోపెద్దగా డబ్బులు ఉండేవి కావు. అందుకే సినిమాకు సబంధించి రకరకాల పనులు చేసేవాడిని. ఓ సారి నా ఫ్రెండ్ సినిమాకు నేను ఘోస్ట్ డైరెక్షన్ చేయడానికి వెళ్ళాను.. షూటింగ్ ఓ ఊళ్లో జరుగుతుంది.  ఆ షూటింగ్ చూడటానికి వచ్చిన జనాల్లో ఓ అమ్మాయి నన్ను ఆకర్శించింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు తననే చూస్తూ ఉన్నాను. తాను మాత్రం షూటింగ్ చూస్తూ ఉండిపోయింది. 

ఆతరువాత తన దగ్గరకి వెళ్ళి.. నన్న పరిచయం చేసుకుని.. నా కార్డ్ ఇచ్చాను. డైరెక్ట్ గా చెప్పేశాను.. నీకు పెళ్ళి చేసుకునే  ఇంట్రెస్ట్ ఉంటే.. ఈ నెంబర్ కు కాల్ చేయమని చెప్పాను అన్నారు పూరి. అలా వారిపరిచయం ప్రేమగా మారిందట. కాని తాను ప్రేమించిన అమ్మాయిని బయటకు తీసుకెళ్లడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావట. తన స్నేహితుల దగ్గర అప్పు చేసి బయటకు తీసుకెళ్లేవాడట. 

అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను ఎన్నో కష్టాలు పడ్డానన్నారు పూరి. 1500 జీతంతో అడ్జెస్ట్ అయ్యేవారట. ఓసారి తాను ప్రేమించిన అమ్మాయి రెస్టారెంట్ కు వెళ్దాం అంటే.. డబ్బులు సరిపోతాయో లేదో అంటూ భయంగా వెళ్లాడట పూరి. ఆమె ఓతందూరి కోడి ఆర్డర్ ఇచ్చి.. కోడి మొత్తం ఒక్కతే తినేసిందట. దాంతో అప్పటి నుంచి  బయటకు వెళ్ళడం మానేసి.. పెళ్లి చేసుకున్నాకే కలుద్దాం అని చెప్పేశాడట దర్శకుడు. ఆ అమ్మాయి  ఎవరో కాదు.. పూరీ జగన్నాథ్ భార్య లావణ్య పూరి. 

 

అవును తమ పెళ్ళి కూడా విచిత్రంగా జరిగింది అన్నారు పూరి. పెద్దలను కష్టపడి ఒప్పించాము. వారు ఒప్పుకున్నాక.. వారికే చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాము అన్నారు. దానికి కూడా ఓ కారణం ఉందట. పెద్దలు పెళ్ళి చేస్తే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మాకు పెద్దగా ఇన్ కమ్ లేదు. అప్పుడు వారి చేత ఖర్చు పెట్టించడం ఎందుకు అని మేమే పెళ్ళి చేసుకుని.. మా పెళ్ళి అయిపోయింది. ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేశారట. 

 

ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తమ పెళ్ళి కూడా తన ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారట. నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమా టైమ్ లో కృష్ణవంశీ దగ్గర పనిచేస్తున్నారట పూరి. ఆ టైమ్ లో షూటింగ్ సెట్ లో తన పెళ్లి జరిగిందని తాళబొట్టు ఒకరు, కూల్ డ్రింక్స్ మరొకరు, పెళ్ళి బట్టలు ఇంకొకరు.. ఇలా అందరూ తలా ఒక ఐటం తీసుకు వచ్చి.. సెట్ లోనే తమ పెళ్లి చేశారన్నారు పూరి.  ఇలా చిత్రంగా జరిగిన పెళ్ళి గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు స్టార్ డైరెక్టర్.

పూరీ జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తరువాత బాగా డిస్సపాయింట్ అయ్యారు. కాని ఏమాత్రం భయపడకుండా.. నెక్ట్ రామ్ తో డబుల్ ఇస్మార్ట్ నుస్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈమూవీ రిలీజ్ కు ముస్తాబవుతోంది. 

2024-07-10T06:20:21Z dg43tfdfdgfd