సందీప్‌ రెడ్డి వంగా మామూలోడు కాదు.. ప్రభాస్‌ కోసం ఇంటర్నేషనల్‌ స్టార్‌..?

ఇండియన్‌ సినిమాల్లో ఇప్పుడు ప్రభాస్‌ పేరు మారుమోగుతోంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు హిట్లతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేస్తున్నాడు. కేవలం భారత్‌లోనే కాదు, అంతర్జాతీయంగానూ ఆయన పేరు వ్యాపించింది. `బాహుబలి` నుంచి ఇంటర్నేషనల్‌కి పరిచయమైంది. నెమ్మదిగా అది విస్తరిస్తుంది. ఇప్పుడు `కల్కి 2898 ఏడీ` సినిమాతో అది మరింత బలంగా వినిపిస్తుంది. ప్రపంచ సినిమా ఇప్పుడు ఇండియా వైపు, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన సైన్స్ ఫిక్షన్‌ మైథాలజీ ఫిల్మ్ `కల్కి` ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు దుమ్మురేపుతుంది. ఇది ఇప్పటికే 900కోట్లు దాటినట్టుగా తెలుస్తుంది. అన్ని ఏరియాల్లోనూ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ప్రభాస్‌ నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనే చర్చ మొదలైంది. సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ `స్పిరిట్‌` సినిమా చేయాల్సి ఉంది. ఇందులో ప్రభాస్ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడని సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. కానీ అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్‌.  రెండింటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది సస్పెన్స్. అయితే ఇప్పటికే ఆయన `ది రాజా సాబ్‌` చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే కంప్లీట్‌ కాబోతుందని సమాచారం. 

అనంతరం ప్రభాస్‌ ఏ సినిమాని స్టార్ట్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. అయితేహను రాఘవపూడి సినిమా మొదట స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోవార్త తెరపైకి వచ్చింది. సందీప్‌ రెడ్డ వంగా మూవీనే త్వరగా ప్రారంభమవుతుందని టాక్‌. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్టార్‌ని దించుతున్నాడట సందీప్‌. ప్రభాస్‌ని ఢీ కొట్టే విలన్‌ పాత్రకి సౌత్ కొరియన్‌ స్టార్ మా డాంగ్ సియోక్‌ పేరుని పరిశీలిస్తున్నారట. ఇది చర్చల దశలో ఉంది. ఈ చర్చలు సక్సెస్‌ అయితే ప్రభాస్‌తో ఢీ కొట్టే విలన్‌ పాత్రలో మా డాంగ్‌ సియోక్‌ ప్రముఖంగా వినిపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

సందీప్‌ రెడ్డి వంగా సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటుంది. మాస్‌, యాక్షన్‌, బోల్డ్ నెస్‌ పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, రణ్‌ బీర్‌ కపూర్‌లను ఓ రేంజ్‌లో చూపించాడు. వాళ్ల స్థాయిలు మించిన చూపించాడు. `యానిమల్`లో రణ్‌ బీర్‌ని ఓ రేంజ్‌లో చూపిస్తే, ఇప్పుడు ప్రభాస్‌ని ఇంకా ఏ స్థాయిలో చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు. 

2024-07-09T18:33:24Z dg43tfdfdgfd