హైదరాబాద్‌ చేరుకున్న ఆస్కార్‌ అవార్డు బృందం

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 17 ః ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్‌ వార్డు పొందిన సినిమా బృందం సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌(శంషాబాద్‌) ఎయిర్‌పోర్టుకు ఉదయం చేరుకున్నారు. ఆస్కార్‌ అవార్డు బృందం సభ్యులు వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

2023-03-17T23:19:10Z dg43tfdfdgfd