రెచ్చిపోయిన ఉన్మాది.. ఆడుకుంటున్న పిల్లల‌పై కత్తితో దాడి

రెచ్చిపోయిన ఉన్మాది.. ఆడుకుంటున్న పిల్లల‌పై కత్తితో దాడి

ఫ్రాన్స్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న పిల్లల‌పై సడన్ గా వచ్చి కత్తితో దాడి చేశాడు.  ఈ ఘటనలో  మొత్తం ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన ఫ్రాన్స్‌ లోని ఆల్ప్స్ ప‌ర్వత శ్రేణుల్లోని అనెక్కీ అనే ప‌ట్టణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో ఓ స‌ర‌స్సు వ‌ద్ద ఉన్న పార్కులో మూడేళ్ల వ‌య‌సున్న చిన్నారులు ఆడుకుంటున్న స‌మ‌యంలో తలపాగా ధరించిన ఓ వ్యక్తి త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో వారిపై అటాక్ చేశాడు.  

విషయం తెలియగానే భద్రతా బలగాలు రంగంలోకి దిగి నిందితుడిని ఆరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని  మంత్రి గెరాల్డ్ డార్మానిన్ ట్వీట్ చేశారు. గాయపడిన పిల్లలలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మూడు సంవత్సరాల వయసులోని పిల్లలు మాత్రమేనని సమాచారం.  

దాడి జ‌రిగిన కొద్దిసేపటికే ఆ దేశ  ప్రధాని ఎల‌జ‌బెత్ బోర్న్ వెళ్లారు. ఈ దాడిని ఖండిస్తూ ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఒక నిమిషం మౌనం పాటించింది.  దాడి జరిగిన ప్రదేశం చుట్టూ రోడ్లు బ్లాక్ చేశారు పోలీసులు.  

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T10:18:59Z dg43tfdfdgfd