రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం

Padma Awards | రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మ విభూషణ్‌ అందుకున్న వారులో ములాయం సింగ్‌ యాదవ్‌ (మరణానంతరం), తబలా వాయిద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్‌ బాలకృష్ణ దోషి (మరణానంతరం), ఓఆర్‌ఎస్‌ సృష్టికర్త దిలీప్‌ మహాలబినస్‌ (మరణానంతరం), ఇండో అమెరికన్‌ శాస్త్రవేత్త శ్రీనివాస్‌ వర్ధన్‌ ఉన్నారు. అలాగే పద్మభూషణ్‌ అవార్డుకు వాణీజయరాం, చిన్నజీయర్‌స్వామి, సుమన్‌ కల్యాణ్‌పూర్‌, కపిల్‌ కుమార్‌, సుధామూర్తి, కమలేష్‌ మూర్తి, కమలేష్‌ డీ పటేల్‌, సుకుమా ఆచార్య, జోదియాభాయ్‌ భాగియా ఎంపికయ్యారు.

అలాగే అలాగే 91 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బీ రామకృష్ణారెడ్డి (సాహిత్యం-విద్య), సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సంకురాత్రి చంద్రశేఖర్‌, గణేశ్‌ నాగప్పకృష్ణరాజనగర, సీవీ రాజు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, కోట సచ్చిదానంద శాస్త్రి, ప్రకాశ్ చంద్రసూద్‌ పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానంలో ఎస్‌ఎంకృష్ణ, కుమార మంగళం బిర్లా సహా పలువురు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్నారు. కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ జగ్‌దీప్‌ దంఖర్‌, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.

2023-03-22T14:59:05Z dg43tfdfdgfd