పిల్లోడిని పులి చంపి తినేసింది.

పిల్లోడిని పులి చంపి తినేసింది.

యూపీలో  ఘోరం జరిగింది. ఓ పదేళ్ల బాలుడిని చిరుత దాడి చేసి చంపేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అఫ్జల్‌ఘర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో గురువారం (సెప్టెంబర్28) రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు ఓ షాపు నుంచి ఇంటికి తిరిగి  పదేళ్ల బాలుడిపై చిరుతపులి దాడి చేసింది.    అయితే చెట్టు వెనుక భాగంలో ఉన్న చిరుత  దాడి చేసి చంపేసింది.ఆ బాలుడిని  చిరుత లాక్కెళ్లడంతో అక్కడున్న  గ్రామస్తులు  భయంతో కేకలు వేశారు. ఆ అరుపులు విన్న  చిరుత ఆ బాలుడిని   వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.     కానీ ఆ బాలుడు చిరుత దాడిలో అప్పటికే మృతి చెందాడు. ధాంపూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, గాయపడిన బాలుడు మరణించాడని పోలీసు అధికారి తెలిపారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులు అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు.   

ALSO READ: ఉజ్జయినీ హర్రర్.. ఆటోపై రక్తపు మరకలు, నలుగురు అరెస్ట్

కాగా.. చిరుతను వెంటనే పట్టుకోవాలని డిప్యూటీ  మేజిస్ట్రేట్ అటవీ అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మోహిత్ కుమార్ ,  పోలీస్ రేంజ్ ఆఫీసర్ భరత్ సోంకర్ గ్రామస్తులను  శాంతింపజేశారు.  బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందజేస్తామని తెలిపారు.  ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.  దగ్గర్లోని అభయారణ్యం నుంచి క్రూర జంతువులు తప్పించుకొని బయటకి వస్తాయని, కావున స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరాడు. స్థానికులు తమ పిల్లలను బయటతిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట ఇంటి చుట్టు పక్కల వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని డీఎఫ్వోన్ గ్రామస్థులకు సూచించారు

©️ VIL Media Pvt Ltd.

2023-09-29T13:00:35Z dg43tfdfdgfd