అమ్మాయిగా మారాలనుకుంటున్న విశ్వక్‌ సేన్‌.. మాస్‌ కా దాస్‌లో ఎన్ని `లీల`లో?

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కెరీర్‌ ప్రారంభంలోనే సెన్సేషనల్‌ స్టార్‌గా నిలిచారు. అదే సమయంలో ప్రయోగాల బాట పడుతున్నారు. తొలి చిత్రం `ఫలక్‌నూమా దాస్‌`తో ఏకంగా దర్శకుడిగా, హీరోగా నిరూపించుకున్నాడు. అగ్రెసివ్‌ క్యారెక్టర్లు చేసే తను `అశోకవనంలో అర్జునకళ్యాణం`లో సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఇటీవల `ధమ్కీ`తో మరోసారి హీరోగా, దర్శకుడిగా సత్తా చాటాడు. ఇందులో ఏకంగా డ్యూయెల్‌ రోల్‌ చేసి వాహ్‌ అనిపించాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా, విశ్వక్‌ సేన్‌కి మంచి పేరొచ్చింది. 

ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశ్వక్‌ సేన్‌. పలు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తన 11వ చిత్రం చేస్తున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో కొన్ని షూటింగ్‌ దశలో ఉండగా, మరికొన్ని స్క్రిప్ట్ ఫైనల్‌ చేసుకుని ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ ఒకటి నెట్టింట, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. విశ్వక్‌ సేన్‌ అమ్మాయిగా మారబోతున్నాడట. సినిమాలో ఆయన అమ్మాయి పాత్రని పోషిస్తున్నారు. 

ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నారు విశ్వక్‌ సేన్‌. `లీల` పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌ వేస్తున్నారట. సెకండాఫ్‌లో ఆయన లేడీ గెటప్‌లో కనిపించబోతున్నారట. ఇదొక సరికొత్త కథాంశంతో ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నారట. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండబోతుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇంతటి చిన్న వయసులో, కెరీర్‌ ప్రారంభంలోనే లేడీ గెటప్‌ చేసిన హీరోగా నిలిచిపోతారు విశ్వక్‌ సేన్‌. ఇప్పటికే చిరంజీవి, కమల్‌, బాలకృష్ణ, విక్రమ్‌, మంచు మనోజ్‌, నరేష్‌ వంటి వారు లేడీ గెటప్‌లు చేసి మెప్పించిన విషయం తెలిసిందే. 

2023-06-03T17:48:54Z dg43tfdfdgfd