క్యాన్సర్‌ నుంచి నవ్రతిలోవాకు విముక్తి

లండన్‌ : తాను క్యాన్సర్‌నుంచి పూర్తిగా కోలుకున్నానని టెన్నిస్‌ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా తెలిపింది. 18 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన నవ్రతిలోవా మూడు నెలల క్రితం గొంతు క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు.

అయితే తాను త్వరగా కోలుకుని తిరిగి టీవీ చానల్‌ బాధ్యతల్లో లీనమైనట్టు 66 ఏండ్ల న్రవతిలోవా తెలిపింది. నవ్రతిలోవా మియామీ ఓపెన్‌లో టీవీ చానల్‌ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నది. చికిత్స సందర్భంగా తాను 15 పౌండ్ల బరువు తగ్గినట్టు ఆమె తెలిపింది. నవ్రతిలోవా 31 మహిళల డబుల్స్‌, 10 మిక్స్‌డ్‌ డబుల్స్‌తో మొత్తంగా 59 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గింది.

2023-03-22T23:52:43Z dg43tfdfdgfd