ఇటీవల సీరియస్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్న హీరో అల్లరి నరేష్ మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తున్నది, ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ…‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని ఆశిస్తున్నా. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ..‘దర్శకుడు మల్లి నాకు పదేండ్లుగా తెలుసు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు నరేష్ అయితే బాగుంటుందని అనుకున్నాం. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : గోపీ సుందర్.
2023-03-22T23:07:12Z dg43tfdfdgfd