భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరించాడు. ఇటీవల గ్రౌండ్‌లోనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ.. బుధవారం చెన్నై (Chennai)లోని చెపాక్ స్టేడియంలో ‘లుంగి డ్యాన్స్’ పాటకి స్టెప్‌లు వేస్తూ కనిపించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈరోజు అక్కడ మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కి వెళ్లే ముందు బౌండరీ లైన్ వద్ద కోహ్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు మైదానంలోకి వచ్చే ముందు భారత ఆటగాళ్లు బౌండరీ లైన్ వద్ద మిగిలిన ప్లేయర్ల కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. అదే సమయంలో స్టేడియంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని లుంగి డ్యాన్స్ పాటని ప్లే చేశారు. దాంతో ఉత్సాహం ఆపుకోలేకపోయిన విరాట్ కోహ్లీ హుషారుగా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. దాంతో స్టేడియంలో ఒక్కసారిగా కేరింతలతో హోరెత్తింది. కోహ్లీ డ్యాన్స్ చేస్తున్నా.. భారత ప్లేయర్లు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కోహ్లీ ఒక్కడే డ్యాన్స్ వేసుకుంటూ కనిపించాడు.
కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నాడు. మైదానంలో యంగ్ క్రికెటర్లని సరదాగా టీజ్ చేయడంతో పాటు ఏమాత్రం మ్యూజిక్ వినపడినా కాలు కదుపుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో సెంచరీతో మళ్లీ కోహ్లీ ఫామ్ అందుకున్న విషయం తెలిసిందే. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌తో భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ముగియబోతోంది.
Read Latest
,
,
2023-03-22T11:32:30Z dg43tfdfdgfd