డ్రై డే (Dry Day) అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆరోజు ఆల్కహాల్ (Alcohol) వంటివి ముట్టుకోరు. అయితే, డ్రై వెడ్డింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆల్కహాల్ లేకుండా పెళ్లి తంతు ముగించడం అన్నమాట. తాము డ్రై వెడ్డింగ్ చేసుకోవాలన్న ఓ జంట నిర్ణయం ప్రస్తుతం బజ్ టాపిక్‌గా మారింది. సాధారణంగా వివాహ వేడుకల్లో డ్రింక్స్ సర్వ్ చేస్తుంటారు. పెళ్లికి వచ్చిన అతిథులకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారు. అవసరమైతే ఆల్కహాల్ ఆఫర్ చేస్తుంటారు. అయితే, తమ పెళ్లికి మాత్రం ఫిల్టర్ వాటర్‌నే డ్రింక్‌గా ఇస్తారట. సోషల్ ప్లాట్‌ఫాం రెడిట్‌లో పెళ్లికూతురు చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆల్కహాల్ సహా వేరే ఇతర ఏ సాఫ్ట్ డ్రింక్స్‌ని కూడా పెళ్లిలో సర్వ్ చేయబోమని కాబోయే జంట క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
వ్యక్తిగత వివరాలు ప్రస్తావించకుండా ‘రెడిట్’లో పెళ్లికూతురు ఓ పోస్టు చేసింది. ఈ ఏడాదిలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. లిక్కర్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని తాము భరించలేమని క్లారిటీ ఇచ్చింది. కేవలం ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే డ్రింక్స్‌గా అందించగలమని చెప్పింది. పైగా, తనకు, తనకు కాబోయే భర్తకు డ్రింక్ చేసే అలవాటు లేదని యువతి పోస్టులో తెలిపింది. కాఫీ కూడా తాగబోమని వివరించింది.
పండుగల సమయంలో తప్ప మామూలు వేళల్లో జ్యూస్, సోడా వంటి వాటిని కూడా ముట్టుకోమని చెప్పింది. అందుకే, తమ పెళ్లిలో ఆల్కహాల్‌ని ఆఫర్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వివాహానికి అయ్యే ఖర్చును నేను, నా భర్త పెట్టుకుంటున్నాం. పెళ్లి ఖర్చులో కొంత భాగం మా అమ్మమ్మ భరించనుంది. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతోనే పెళ్లిలో ఆల్కహాల్ వద్దని నిర్ణయం తీసుకున్నాం’ అని పోస్టులో తెలిపింది.
* వంటకాల్లో తగ్గేదేలే..
ఇరు కుటుంబాలు చాలా పెద్దవని పెళ్లికూతురు చెప్పుకొచ్చింది. ‘కుటుంబంలో ఎంతో మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరందరి సమక్షంలో వివాహం చేసుకోవాలని భావించాం. పెళ్లికి దాదాపు 100 నుంచి 150 మంది వరకు అతిథులు వస్తారు. వీరికి ఆల్కహాల్‌తో పాటు ఇతర బేవరేజెస్ సరఫరా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే, భోజనం విషయంలో రాజీ పడేదే లేదు. ఎన్నో రకాలు వంటకాలు వడ్డించనున్నాం. ఇందుకోసం భారీగా వెచ్చించాలని నిర్ణయించాం’ అని రెడిట్ పోస్టులో పెళ్లికూతురు తెలిపింది.
ఇది కూడా చదవండి : అద్దెకి అందమైన గర్ల్‌ఫ్రెండ్స్.. అబ్బాయిలకి లక్కీ ఛాన్స్.. ఎక్కడంటే!
* నిర్ణయంపై మిశ్రమ స్పందన..
కాబోయే జంట తమ నిర్ణయాన్ని వెలువరించగానే చాలామంది అతిథులు షాక్ అయ్యారట. ఇలాంటి పెళ్లి చేసుకోవడం బోరింగ్ అంటూ చెప్పుకొచ్చారట. కనీసం సోడా అయినా అరేంజ్ చేయాలని సూచించినట్లు పెళ్లికూతురు గుర్తు చేసుకుంది. ఇది సంప్రదాయమైన పెళ్లికి విరుద్ధం అంటూ చెప్పారట. నెటిజన్లు మాత్రం కాబోయే కపుల్ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని మద్దతు ఇస్తున్నారు. కొందరైతే వివిధ సూచనలు చేస్తున్నారు. పెళ్లికి వచ్చే అతిథులు సొంత డబ్బులతో ఆల్కహాల్ తెచ్చుకోవాలన్న కండీషన్ పెడితే బాగుంటుందని ఓ యూజర్ సూచించాడు.
2023-03-23T08:14:27Z dg43tfdfdgfd