రావణాసుర నుంచి డిక్కా డిష్యూం సాంగ్

రావణాసుర నుంచి డిక్కా డిష్యూం సాంగ్

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రావణాసుర’. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్. సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ కానుంది.  మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన  మాస్ పార్టీ సాంగ్  ‘డిక్కా డిష్యూం’ని బుధవారం  విడుదల చేశారు మేకర్స్. రవితేజ చేసిన మాస్ మూమెంట్స్  మెస్మరైజ్ చేశాయి. ‘లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా..క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా’ అంటూ  కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాయగా.. స్వాతి రెడ్డి యూకే, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిండ్ల కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది. 

©️ VIL Media Pvt Ltd.

2023-03-23T03:16:09Z dg43tfdfdgfd