Aishwarya Rajinikanth: ఇటీవల రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా తెరవని లాకర్ కీ తన దగ్గర ఉన్నప్పటికీ బంగారు అభరణాలు మాయం కావటంపై ఐశ్వర్య రజినీకాంత్ తేనాం పేటలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పని చేసే ముగ్గురిపై ఆమె అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి అసలు దొంగలను కనిపెట్టేశారు. ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో పని చేసిన పనివాళ్లే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది.
రెండు రోజుల ముందు అన్‌కట్ డైమండ్స్, పురాతన బంగారు ముక్కలు, బంగారు వజ్రాలతో ఉన్న చెవిపోగులు, నవతర్నం సెట్లు, ఆరమ్ నెక్లెస్, 60 సవర్ల బంగారు గాజులు లాకర్ నుంచి మాయమైనట్లు ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.60లక్షలు విలువైన అభరణాలు చోరీ అయ్యాయి. దర్యాప్తులో పోలీసులకు ఐశ్వర్య ఇంట్లో పని చేసిన ఇద్దరు మహిళలు, డ్రైవర్ వెకంటేష్‌ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన అభరణాలను నగదుగా మార్చుకుని ఓ ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులను కొన్నట్లు విచారణలో వారు తెలిపారు.
ప్రస్తుతం ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలామ్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్నఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 8 ఏళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆమె ధనుష్ నటించిన 3 చిత్రంతో దర్శకురాలిగా రంగప్రవేశం చేసిన ఐశ్వర్య ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ నటించిన వాయ్ రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ALSO RAED:
98911208
Read Latest
and
2023-03-22T13:07:13Z dg43tfdfdgfd