తన సినిమాపైనే సెటైర్లు వేసుకున్న సుడిగాలి సుధీర్‌.. 32లో స్టార్ట్ అయితే 35లో రిలీజ్‌ అంటూ..

సుడిగాలి సుధీర్‌ టీవీకి గుడ్‌ బై చెప్పి ఇప్పుడు పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. ఆయన ఇప్పటికే `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`, `వాంటెడ్‌ పండుగాడ్‌`, `గాలోడు` చిత్రాల్లో నటించాడు. హీరోగా మెప్పించాడు. `గాలోడు` చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. `కాలింగ్‌ సహస్త్ర` అనే చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా బుధవారం ఈ సినిమాలోని `కలయా నిజమా` అనే పాటని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హీరో సుడిగాలి సుధీర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టిందనే విషయాన్ని ఆయన సెటైరికల్‌గా చెప్పారు. తన 32ఏళ్ల టైమ్‌లో సినిమా ప్రారంభమయితే ఇప్పుడు తన ఏజ్‌ 35 అని, మూడేళ్లు పట్టిందనే విషయాన్ని ఆయన కామెడీగా చెప్పారు. దీంతో స్టేజ్‌ మొత్తం నవ్వులుపూయించింది. మూడేళ్లుగా కష్టపడి సినిమా చేశామని, ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చినట్టు చెప్పారు. పెద్ద సినిమాలకు లాగనే తమ సినిమాకి కూడా కష్టాలు వచ్చినట్టు చెప్పారు సుధీర్‌. 

ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌ విక్కిరాలా గురించి సుధీర్‌ చెబుతూ, మొదట తనకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు చిన్న బ్లూటూత్‌ స్పీకర్‌ తీసుకొచ్చి కథ చెప్పినట్టు వెల్లడించారు. హీరోగా తనకి కథ అర్థమయ్యేలా, దాంట్లో ఇన్‌వాల్వ్ చేసేలా సౌండ్‌, మ్యూజిక్‌ ఎఫెక్ట్స్ తో కథ చెప్పారని, ఫస్ట్ టైమ్‌ ఓ కథని ఇలా విన్నానని వెల్లడించారు. సినిమా చేసేలా మూడ్‌ని క్రియేట్‌ చేసిన చెప్పాడని, అలాంటి ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా తీయడంలోనూ అంతే కేర్‌ తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు తాను ఉన్నజోనర్ ఒకటైతే, దాన్నిపూర్తి మార్చేసి కంప్లీట్‌ కొత్త జోనర్‌లోకి తీసుకెళ్లారు. 

మరోవైపు సీన్లు,డైలాగ్‌ల గురించి చెబుతూ, దర్శకుడు చెప్పిన డైలాగులు ఒకలా చెపితే, తాను మరోలా కావాలంటాడట. ఆయన మైండ్‌లో ఒక స్కేల్‌ ఉంటుంది, నేను ఏదైనా చేస్తే సర్‌ మీరు 6 చేస్తున్నారు, నాకు 7 కావాలి అంటారు, నాకు సిక్సే అర్థం కాదు, మళ్లీ ఆ సెవన్‌ ఏంటో ఏం చేయాలో తెలియదు. మొత్తం అయిపోయాక, సుధీర్‌ జీ మీరు 9 చేశారు, నాకు 7.3 కావాలి అంటారని సెటైరికల్‌గా, సరదాగా చెప్పారు సుధీర్‌. ఇది ఈవెంట్‌లో ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇలా ఈవెంట్‌ని సరదాగా మార్చేశారు సుడిగాలి సుధీర్‌. 

ఇక సుధీర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో డోలిశ్య హీరోయిన్‌గా నటిస్తుంది. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వం వహిస్తుండగా, షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు నిర్మించారు. బుధవారం విడుదల చేసిన `కలయా నజమా` పాటని లక్ష్మీ ప్రియాంక రాయగా, కె చిత్ర ఆలపించారు. మెహిత్‌ రెహ్‌మానిక్‌ సంగీతం అందించారు. పాటకి మంచి స్పందన లభిస్తుంది. త్వరలోనే సినిమాని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

2023-06-08T07:05:29Z dg43tfdfdgfd