హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

హుండీని  ఎత్తుకెళ్లిన దొంగలు

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ కొడుకుగా పిలిచే పరశురాముడి గుడిలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లినట్లు రూరల్  ఎస్ఐ ఆనంద్  తెలిపారు. హుండీని ఇద్దరు ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించామని చెప్పారు. గుడిలోకి వచ్చిన దొంగలు ముందుగా దేవుడికి నమస్కరించి ఎదురుగా ఉన్న హుండీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో మరో హుండీ తీసుకెళ్లినట్లు తెలిపారు. రిజర్వాయర్  సమీపంలోకి తీసుకెళ్లి తాళాలు పగలగొట్టి డబ్బు ఎత్తుకెళ్లినట్లు ఈవో కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. 

పెబ్బేరు, వెలుగు: పట్టణ శివారులోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఈ నెల 23న గుడిలోని 21 తులాల వెండి వస్తువులను దొంగిలించినట్లు ఎస్ఐ జగదీశ్వర్​రెడ్డి తెలిపారు. ఆలస్యంగా గుర్తించిన అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-05-28T07:59:51Z dg43tfdfdgfd