సూపర్ స్టార్ సినిమాలో యాక్షన్ కింగ్, రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న అర్జున్..?

ఈ మధ్య స్టార్ హీరో కాంబినేషన్లపై వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ విలన్ గా కమల్ హాసన్ అంటూ వార్త షికారు చేస్తుండగానే ఇప్పుడు మరోక రూమర్ తెగ వైరల్ అవుతోంది. అది కూడా తమిళనాట ఎక్కువగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్టు సమాచారం.ఇంతకీ అసలు వివరాల్లోకి వెళ్తే.. 

రజనీకాంత్ త్వరలో కే.ఈ జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరపుకుంటున్న ఆసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.  ఫేక్ ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా రిటైర్ అయిన పోలీసుల పోరాటల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. కే.ఈ జ్ఞానవేల్ రాజా  డైరెక్షన్.. ఆయన రాసుకున్న కథ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోకు సమానంగా విలన్ రోల్ ఉండనుందట. దాంతో ఆ పాత్ర కోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను సంప్రదించారట. కథ నచ్చడంతో అర్జున్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం ముందుగా విక్రమ్ ను కూడా సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే విలన్ గా చేసేందుకు విక్రమ్ అంగీకరించలేడట. 

70 ఏళ్లు దాటినా కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ ఎక్కించేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఏజ్ మీదపడుతున్నా..అదే జోరుతో షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు తలైవా. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. నెల్సన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని..  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్య కృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించడం విశేషం. 

ఇక ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఈసినిమా నుంచి  రిలీజైన అప్ డేట్ వీడియోలు అంతకంతకూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. అగస్టు లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈసినిమాతో పాటు రజనీకాంత్ తన కూతురు  ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ సినిమా కూడా చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ మోయిదీన్‌ భాయ్‌గా కనిపించనున్నాడు. 

2023-06-01T11:03:02Z dg43tfdfdgfd