Super star Mahesh babu - Megastar Chiranjeevi: కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ నెలకొంటుంది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయినప్పుడు దీని గురించి హీరోలు పట్టించుకోకపోవచ్చు. కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగానే గమనిస్తుంటారు. మరో వైపు ట్రేడ్ వర్గాలు సైతం బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో ఎలాంటి లెక్కలుంటాయనే విషయాన్ని గమనిస్తుంటుంది. ఉదాహరణకు ఈ సంక్రాంతికి చిరంజీవి(megastar chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna) మధ్య పోటీ జరిగింది. ఇద్దరూ హీరోల్లో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినప్పటికీ కలెక్షన్స్ విషయంలో చిరంజీవిదే కాస్త పైచేయిగా నిలిచింది. మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ పోటీ ఇప్పుడు నెలకొంది. ఇంతకీ ఆ పోటీ ఎవరెవరి మధ్యలో తెలుసా? ఒకరేమో మెగాస్టార్‌చిరంజీవి.. మరొకరు సూపర్‌స్టార్ మహేష్ బాబు.
ఒక వైపు చిరంజీవి, మరో వైపు మహేష్ బాబు.. ఇద్దరూ పోటీ పడబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఉగాది సందర్భంగా ప్రకటించారు. అయితే అదే రోజున మరో రెండు భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. వాటిలో ఒకటి సూపర్‌స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న SSMB 28. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని పలు సందర్భాల్లో నిర్మాత చెప్పిన సంగతి తెలిసిందే. ఉగాది రోజున ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన వస్తుందని భావించిన ఫ్యాన్స్, అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజున పోటీ పడుతున్నారు. ఈ పోటీ కచ్చితంగా అభిమానుల్లో కూడా పోటీని క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఓ వర్గం మాత్రం మహేష్, త్రివిక్రమ్ మూవీ SSMB 28 రిలీజ్ డేట్ మళ్లీ మారిందని, దసరాకు వెళ్లిందని చెబుతోంది. ఆ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసుకున్న తర్వాతే మెగా వర్గం భోళా శంకర్‌ను లైన్‌లో తీసుకొచ్చిందని అంటున్నారు.
Read Latest
and
2023-03-22T11:22:09Z dg43tfdfdgfd