3 అడుగుల బాడీ బిల్డర్ కు.. 4 అడుగుల అమ్మాయితో పెళ్లి

3 అడుగుల బాడీ బిల్డర్ కు.. 4 అడుగుల అమ్మాయితో పెళ్లి

మహారాష్ట్రకు చెందిన పొట్టి బాడీబిల్డర్ విఠల్ మోహిత్ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. 28 ఏళ్ల ఈ పొట్టి బాడీబిల్డర్.. తనలాగే పొట్టిగా ఉన్న 4 అడుగుల 2 అంగుళాలు ఉన్న జయ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. వీళ్లిద్దరూ నాలుగేళ్ల క్రితం కలుసుకున్నారు.. అప్పటి నుంచి వీరు స్నేహితులుగా ఉంటూరు వచ్చారు. ఈ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది.

2021లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీ బిల్డర్ పోటీల్లో గెలిచి గిన్నిస్ రికార్డ్ సాధించాడు.  2012లో కసరత్తులు ప్రారంభించాడు. బరువులు ఎత్తటానికి ఎంతో కష్టపడ్డాడు. అయినా పట్టువదలకుండా ఐదేళ్లు కష్టపడి.. 2016లో మొదటిసారి పొట్టి బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొన్నాడు. స్నేహితుల సూచనతో గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ప్రయత్నించి.. విజయం సాధించాడు. 

తన ఎత్తు విషయంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాను అంటున్నాడు మోహిత్. అందరిలాగే నాకు కూడా పెళ్లిపై ఎన్నో ఆశలు ఉన్నాయని.. జయ పరిచయంతో ఆ కల నెరవేరిందన్నారు. ఎన్నో ఏళ్లుగా జయ తెలుసు అని.. ఆమెకు ఓ మంచి జీవితం ఇవ్వాలనేదే తన ఆశయం అంటున్నాడు మోహిత్. ఆమె నా కంటే కొంచెం ఎత్తు అని.. మొదట నేనే ఇష్టపడ్డాను అని.. ఆ తర్వాత ఆమె ఇష్టపడటం ప్రారంభించింది అన్నారు ప్రతీక్ మోహిత్. 

హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మెహందీతోపాటు బరాత్ కూడా నిర్వహించారు. పెళ్లి దుస్తుల్లో ప్రతీక్ మోహిత్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జోడీ బాగుందంటూ నెటిజన్లు ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. పొట్టోడు అయినా గట్టోడు.. పొట్టి బాడీ బిల్డర్ కావటం సామాన్య విషయం కాదని.. ఇప్పుడు పెళ్లి చేసుకుని మరో ఘనత సాధించాడంటూ నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2023-03-18T10:13:10Z dg43tfdfdgfd