Akkineni sushanth | అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటివరకు సరైన హిట్టు అందుకోలేకపోయాడు హీరో సుశాంత్. పదిహేనేళ్ల క్రితం ‘కాళిదాసు’ అనే సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తొలి సినిమాతోనే డిజాస్టర్ ఫలితాన్ని చూశాడు. ఆ తర్వాత ‘కరెంట్’ కాస్త పర్వాలేదనిపించినా.. ‘అడ్డా’తో మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. దాంతో మూడేళ్ల వరకు మరో సినిమా చేయలేదు. సుశాంత్ సినిమాల్లో కాస్తో కూస్తో ఎంటర్టైన్ చేసిందంటే అది ‘చిలసౌ’ సినిమానే. రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయినా ప్రేక్షకులు ప్రశంసలు పొందింది.
ఇక ‘అలా వైకుంఠపురం’ సినిమాతో సెకండ్ హీరోగా మారిన సుశాంత్.. ‘రావణాసుర’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన్ టీజర్లో సుశాంత్ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ అక్కినేని కుర్రాడు మెగాస్టార్ సినిమాలో చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యతో మెగా కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం అదే జోష్‌తో భోళా శంకర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మెహర్ రమేష్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది. తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం చిత్రబృందం సుశాంత్‌ను సంప్రదించిందని టాక్.
సుశాంత్‌కు కూడా పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశాడట. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా సుశాంత్ కనిపించనున్నాడట. అయితే తమిళంలో ఈ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. కానీ సుశాంత్ కోసం ఈ పాత్రను కాస్త పెంచుతున్నారని టాక్ అంతేకాకుండా వీరి మధ్య ఒక పాట కూడా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.