DAGGUBATI VENKATESH | తమిళ రీమేక్‌లో

కోలీవుడ్‌లో ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించిన సినిమా ‘అయోథి’. మతం నేపథ్యంగా సాగే ఈ యాక్షన్‌ డ్రామాలో శశికుమార్‌, ప్రీతి అస్రానీ, యష్పాల్‌ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటిస్తాడని, తెలుగులో వెంకటేష్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నారని సమాచారం.

‘దృశ్యం’ తరహా మలుపులతో సాగే ఈ చిత్రానికి వెంకటేష్‌ సరైన ఎంపిక అనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగు, హిందీలో ఈ చిత్రానికి ‘అయోధ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించే ఈ సినిమా జూన్‌ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఆయన ప్రస్తుతం శైలేష్‌ కొలను దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ ‘సైంధవ్‌’లో నటిస్తున్నారు.

2023-03-18T22:34:49Z dg43tfdfdgfd