DAS KA DHAMKI | హైదరాబాద్‌లో సెటిల్ అయిపోదామనుకుంటున్నవా..? విశ్వక్‌ సేన్ ప్రశ్నకు నివేదా పేతురాజ్ రియాక్షన్ ఇదే..!

Das Ka Dhamki | టాలీవుడ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటిస్తున్న తాజా చిత్రం దాస్ కా ధమ్‌కీ (Das Ka Dhamki). విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం మార్చి 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో విశ్వక్‌ సేన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. Let Put a Meme Face అంటూ ఫన్ చిట్ చాట్ సెషన్‌లో పాల్గొన్నారు విశ్వక్‌ సేన్, నివేదా పేతురాజ్‌.

ఈ మధ్య తమిళంలో కంటే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తున్నావ్‌.. హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొన్నవ్‌.. అంటే ఇక్కడ పర్మినెంట్‌గా సెటిల్ అయిపోదామనుకుంటున్నావా..? అని విశ్వక్‌ సేన్అడిగితే అవును అన్నట్టుగా కన్నుకొడుతోంది నివేదా పేతురాజ్‌. ఓ కస్టమర్‌ ఆర్డర్‌ను ఐదుసార్లు మారిస్తే.. మీ రియాక్షన్‌ ఏంటని నివేదా అడిగితే..? ధమ్‌ కీ ఇచ్చినట్టు మీమ్‌ పోజ్‌ పెట్టాడు విశ్వక్‌సేన్‌. నువ్వు నటించే హీరోయిన్లందరితో నిన్ను లింకప్ చేస్తుంటే.. నీ రియాక్షన్‌..? ఏంటీ . అలాగే నీ గర్ల్‌ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు నీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ వచ్చి హలో చెబితే.. ఎలా ఫీలవుతావ్‌.. అని అడుగుతోంది నివేదా పేతురాజ్‌.. ఇద్దరి మధ్య సాగిన ఫన్ చిట్ చాట్‌ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌ చల్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టోరీతో వస్తోన్న ఈ చిత్రంలోరావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్ సినిమాస్‌ బ్యానర్లు ధమ్‌ కీ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నాడు.

2023-03-19T12:20:03Z dg43tfdfdgfd