GUPPEDANTHA MANASU: విశ్వనాధానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మురుగన్.. రంగంలోకి దిగిన రిషి!

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుని మంచి టిఆర్పి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. రౌడీల గుప్పెట్లో ఉన్న కాలేజీని రక్షించడానికి నడుం బిగించిన ఒక లెక్చరర్ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

 

 ఎపిసోడ్ ప్రారంభంలో పాండ్యన్ తండ్రి మురుగన్ విశ్వనాథం ఇంటికి వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటాడు. పిల్లలు సరదాలు పడే వయసు వాళ్ళు తప్పు చేస్తే భుజం తట్టి మందలించాలి కానీ సస్పెన్షన్ వరకు వెళ్ళకూడదు అది మీకే మంచిది కాదు అంటాడు. ఏంటి బెదిరిస్తున్నారా అని అడుగుతాడు విశ్వనాథం.

నాకు బెదిరించడం చేతకాదు బెదిరించే వాడినే అయితే లారీడు జనాన్ని తీసుకొచ్చి మీ ఇంటిని చుట్టుముట్టేవాడిని అలాంటి పరిస్థితి తీసుకురాకండి మరెప్పుడూ ఇలాంటి సస్పెన్షన్ల జోలికి వెళ్ళకండి అంటూ బెదిరించి వెళ్ళిపోతాడు మురుగన్. సీన్ కట్ చేస్తే తడిచిపోయిన చీరతో వస్తున్న వసుధారని చూసి షాక్ అవుతాడు ప్రిన్సిపల్. ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది వసుధార.

 

మీరు వాళ్ల మీద కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతాయి  అంటుంది వసుధార. అలా చేసినందుకే పాండియన్ తండ్రి విశ్వనాథం గారి దగ్గరికి వెళ్లి బెదిరించి వచ్చాడంట అని చెప్తాడు ప్రిన్సిపల్. మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది వసుధార. ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి విశ్వనాధానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు ప్రిన్సిపల్.

 

 యాక్షన్ తీసుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విశ్వనాథం. కానీ ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోతాడు. అంతలోనే అక్కడికి వస్తారు రిషి, ఏంజెల్. ముభావంగా ఉన్న విశ్వనాధాన్ని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు రిషి. జరిగిందంతా చెప్తాడు విశ్వనాథం. ఒకసారి మీ కాలేజీకి వెళ్లొచ్చా అని అడుగుతాడు రిషి. వెళ్లొచ్చు అని ఆనందంగా చెప్తాడు విశ్వనాథం.

 

 ఆ తర్వాత కాలేజీకి వెళ్తాడు రిషి. అక్కడే ఫుట్బాల్ ఆడుతున్న రెడీ గ్యాంగ్ ఆగడాలని చూస్తాడు. కారు దిగిన రిషి ని చూసి ఎవరో కొత్త లెక్చరర్ అనుకోని అట్నుంచి అటే వెనక్కి పంపించేద్దాం అనుకుంటారు కేడి గ్యాంగ్. ఫుట్బాల్ రిషి మీదికి విసురుతారు కానీ రిషి దానిని ఒడుపుగా పట్టుకొని వాళ్ల మీదకే విసిరి కొట్టి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా షాకైన కేడి గ్యాంగ్ వాడిని వదలకూడదు అనుకుంటారు.

 

 రిషి ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లే దారిలో అడ్డగా కనిపించకుండా వైరు కడతారు. ఏం చేస్తున్నారు అని ఒక లెక్చరర్ అడుగుతాడు. నీకు అవసరమా పోయి పని చూసుకో అంటూ పొగరుగా మాట్లాడుతారు కేడీ గ్యాంగ్. బాధపడిన లెక్చరర్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి ఈరోజు ఎవరికో ముగిసింది అంటూ కేడిగ్యాంగ్ చేస్తున్న పని గురించి చెప్తాడు. వాళ్లు అలా చేస్తే వచ్చినవాళ్లు కాలేజీ గురించి తప్పుగా అనుకుంటారు అనుకొని వాళ్లు చేస్తున్న పనిని ఆపడానికి వెళుతుంది వసుధార.

 

 కానీ అప్పటికే రిషి తెలివిగా వైరు దాటుకొని  ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి తనని తాను పరిచయం చేసుకొని వచ్చిన విషయం చెప్తాడు. పిల్లలకి లెక్చరర్స్ భయపడటం ఏంటి సార్ అయినా వాళ్ల ప్రవర్తన బాగోలేనప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు మొదట్లోనే ఖండించవలసింది కదా అని అడుగుతాడు ప్రిన్సిపల్. వాళ్ళ నాన్న పెద్ద రౌడీ వీడని ఏమైనా అంటే వాడు ఊరుకోడు. కొడుకు ఏం చేసినా వాడికి తప్పుగా అనిపించదు.

 

మొదట్లో ఒకసారి వాడి మీద యాక్షన్ తీసుకున్నందుకు నా కారు ట్యాంక్ లో పంచదార పోశారు అని చెప్పి తను అనుభవాన్ని చెప్తాడు ప్రిన్సిపల్. అయితే ఇక్కడ సమస్య పిల్లలతో కాదు వాళ్ళ తండ్రితో మీరు ఆ మురుగన్ అడ్రస్ ఇవ్వండి నేను వెళ్లి మాట్లాడుతాను అంటాడు రిషి. అదే చాలా రిస్క్ అంటాడు ప్రిన్సిపల్. లేదు నేను మాట్లాడుతాను అని చెప్పి అతని దగ్గర నుంచి అడ్రస్ తీసుకుంటాడు రిషి.

 

ఆ తరువాత కారు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే కేడి గ్యాంగ్ తన కారుకి గాలి తీసేసి పక్కన కూర్చుంటారు. పాపం కారులో వచ్చాడు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాడు అని రిషి ని ఆటపట్టిస్తారు కేడీ గ్యాంగ్. కానీ రిషి వేరే టైరు మార్చి అదే కారులో వెళ్ళిపోతాడు. వాడు లెక్చరర్ కాదేమో అనుకుంటారు కేడి గ్యాంగ్. ఎవడైతే మనకేంటి ఎంజాయ్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అంటాడు అందులో ఒక వ్యక్తి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

2023-06-08T05:05:37Z dg43tfdfdgfd