HYDERABAD NEWS : 45 ఏళ్ల వయసులో ప్రేమ, లెటర్ రాసిపెట్టి -ఫ్రెండ్ భార్యతో వ్యాపారి అదృశ్యం!

Hyderabad News : 45 ఏళ్ల వయసులో ఆయనలో ప్రేమ చిగురించింది. బంధాలు, బంధుత్వాలు అన్నీ పక్కకు పెట్టి ప్రేమ కోసం పరారయ్యాడు. పేరు, డబ్బు అన్ని సంపాదించినా మనసు మాత్రం తోడును కోరుకుంది. ఇళ్లాలిని, కన్న బిడ్డలను వదులుకోని ఆయన చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాల ప్రభావమో లేక మనసులో కలిగిన ఆలోచనో కానీ ఫ్రెండ్ భార్యతో వెళ్లిపోతున్నానని చెప్పి లెటర్ రాసి వెళ్లిపోయాడో వ్యాపారి.

అసలేం జరిగింది?

సికింద్రాబాద్ బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన స్వీట్ షాపు వ్యాపారి అతుల్ విడోరియా నాలుగు రోజుల క్రితం అదృశ్యం అయ్యారు. మే 29న ఇంటి నుంచి బయటకు వెళ్తిన వచ్చిన అతుల్..తను షిరిడీ వెళ్తున్నానని చెప్పడంతో..ఆయన కుమారుడు జూబ్లీ బస్టాండ్లో డ్రాప్ చేశారు. ఇక 30వ తేదీన కాల్ చేయగా అతుల్ ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంతో దైవ దర్శనంలో ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావించారు. అతుల్ ఫోన్ ఎంతకీ రింగ్ కాకపోవడంతో కాస్త అధైర్యపడ్డారు. అయితే అతుల్ భార్యకు ఇంట్లో దొరికిన లెటర్ అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంట్లో కప్ బోర్డ్ క్లీన్ చేస్తున్న తరుణంలో ఆ లెటర్ దొరకింది. ఈ లేఖలో తన మిత్రుడి భార్యపై తనకు మనసైందని..అతని మిత్రుడికి కూడా ఈ విషయం తెలుసని, మేమిద్దరం కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నమాని..అందుకే ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అంటూ లెటర్ లో అతుల్ రాశారు. తనకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని..ఆమెతో ఉండాలని కోరుకుంటున్నా అంటూ, తన కోసం వెతకొద్దని లేఖలో రాశారు.

భర్త చేసిన పనికి భార్య ఫిర్యాదు

అతుల్ నిర్ణయంతో ఏం చేయాలో అర్ధం కానీ అతని భార్య వెంటనే మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరిసారిగా జూబ్లీ బస్టాండ్ లో డ్రాప్ చేశామని..అతని వెంట పది లక్షల నగదు, మూడు గోల్డ్ రింగులు, చైన్ ఉన్నయంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న మారేడుపల్లి పోలీసులు..సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ యువతి ఎవరు? అతని భర్త విజయ్ ఎక్కడ ఉంటారు? అన్న సమాచారం లేకపోవడంతో ..అతుల్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

అయితే 45 ఏళ్ల వయసులో మరో యువతితో వెళ్లిపోతున్నానని అతుల్ లేఖ రాసి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. మరో యువతితో కలిసి ఉండేందుకు అతుల్ నిర్ణయించుకున్నారా? లేక కుటుంబ సభ్యులను బెదిరించేందుకు అలా లెటర్ రాశారా? అన్నది ఈ లవ్ స్టోరిలో ట్విస్ట్.

2023-06-03T10:13:46Z dg43tfdfdgfd