Indrakaran Reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభువు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.
Indrakaran Reddy2
దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను శ్రీ సచ్చిదానంద స్వామి పరిశీలించారు.