Kavitha : ఢిల్లీకి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి స్పెషల్ ప్లైట్ లో వెళ్లిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి వెళ్లారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 20న విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేకా గతంలో మాదిరిగా తన లాయర్ ను పంపిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసలు పంపించడంపై కవిత ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యలయానికి పిలవడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఫిటిషన్ ధాఖలు చేశారు. కవిత పిటిషన్ పై మార్చి 24న సుప్రీం విచారణ చేపట్టనుంది.
©️ VIL Media Pvt Ltd. 2023-03-19T15:58:51Z dg43tfdfdgfd