MEGHA AKASH WEDDING: పెళ్లి పీటలెక్కబోతున్న మేఘా ఆకాష్? వరుడు ఎవరో తెలుసా?

Megha Akash : నటి మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. మేఘా ఇటీవలే తెలుగులో ‘రావణాసుర’, ఓటీటీలో ‘బూ’ మూవీలతో ఆకట్టుకుంది. అయితే, ఆ సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడం, అవకాశాలు కూడా తగ్గడంతో మేఘా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేఘా పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుడు, వ్యాపారవేత్త కొడుకును పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది.

మేఘా ఆకాష్ కుటుంబానికి, ఆ రాజకీయ నాయకుడి కుటుంబానికి మధ్య దీర్ఘకాల స్నేహం ఉన్నట్టుగా పలు కథనాలు వస్తున్నాయి.  వారిద్దరూ స్నేహితుల నుంచి జీవిత భాగస్వాములుగా మారాలనే నిర్ణయం తీసుకున్నారని, వారి ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను ప్రకటించనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మేఘా ఆకాష్, ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మేఘా ఆకాష్ తన కెరీర్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వంటి ఇండస్ట్రీ దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఆమె నటించిన ఫిల్మోగ్రఫీలో 'రాజా రాజా చోరా' మూవీ మాత్రమే హిట్ గా నిలిచింది. మేఘా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్తలో ఓ హీరో ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడని గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత అందులో నిజం లేదని తేలింది. ప్రస్తుతం ఆ హీరో పెళ్లి చేసుకుని సెటిలయ్యాడు. అతడు కూడా ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.

టాలీవుడ్ కు 'లై' సినిమాతో పరిచయం అయిన మేఘా ఆకాశ్ తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'మను చరిత్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తుండగా.. శివ కందుకూరి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మేఘా ఆకాశ్ ఫీమేల్‌ లీడ్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. 'మ‌ను చరిత్ర' లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. కాగా శివ కందుకూరి 'చూసి చూడంగానే' సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 'మను చరిత్ర' సినిమా 23, 2023న థియేటర్లలో విడుదల కానుంది.

రేపు వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఇంట్లో అతి త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తెలుగు తెర 'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారనేది కొత్త వార్త ఏమీ కాదు. చిత్రసీమ ప్రముఖులకు, ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే... ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ చెప్పింది లేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. జూన్ 9న శుక్రవారం వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం ఇద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Read Also : NBK 108 Is Bhagavanth Kesari : అఫీషియల్‌గా బాలకృష్ణ సినిమా టైటిల్ చెప్పేశారోచ్ - ఇగ మాస్ ఊచకోత షురూ

2023-06-08T07:37:29Z dg43tfdfdgfd