టాలీవుడ్ యువ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). స్వీటీ టీం ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా నుంచి నోనోనో (NoNoNo Lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు.
నీ స్నేహం, నీ మోహం.. నీ బంధం, అనుబంధం.. ప్రేమించే సమయం లేదే.. ప్రేమన్నా ప్రశ్నే లేదే.. అని సోలో లైఫ్ బెటర్ అంటూ స్టైలిష్‌గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎంఎం మానసి పాడారు. రాధన్ మ్యూజిక్ పాటను స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏండ్ల మహిళగా కనిపించబోతుంది. సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నోనోనో లిరికల్ సాంగ్..