సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విషయాల్లో ప్రపంచ దేశాల్లో వైరుధ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైరుధ్యాలే ఓ తల్లికి తన పిల్లలను దూరం చేస్తే…తన బిడ్డలను దక్కించుకునేందుకు ఆ దేశ ప్రభుత్వంతో మాతృమూర్తి ఎలాంటి పోరాటం చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకులతో పాటు దేశవాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నది. రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించింది. సాగరిక చక్రవర్తి అనే మహిళ జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నార్వేలో ఉద్యోగం చేస్తున్న భర్త కోసం అక్కడికి వెళ్లిన మిసెస్ ఛటర్జీ..తన పిల్లలకు చేత్తో అన్నం తినిపిస్తుందని, అల్లరి చేస్తే గట్టిగా మందలిస్తుందనే కారణాలు చూపుతూ…ఆ దేశ ప్రభుత్వం ఆమె పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తుంది. మన దేశంలో సాధారణమైన ఈ విషయాలు అక్కడి చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడతాయి. దేశాల మధ్య ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల తన జీవితంలో ఏర్పడిన సమస్యతో పోరాడి బిడ్డలను గెల్చుకుంటుంది మిసెస్ ఛటర్జీ.
2023-03-18T21:04:55Z dg43tfdfdgfd