బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ హృతిక్ రోషన్‌తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహాంతో ‘బాట్లా హౌస్’, ఫర్హాన్ అక్తర్‌కు జోడీగా ‘తూఫాన్’ తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ‘సీతారామం’ సినిమా విజయం దక్షిణాదిలో ఆమె జోరు పెంచింది. సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకోవడమే కాదు గ్లామర్ పాత్రల్లో కూడా మెప్పించడం మృణాల్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాని 30, సూర్య వీర్ చిత్రాల్లో నటిస్తున్నదీ భామ. సౌత్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగులో అవకాశాలు పెరిగిన నాయికలు ఇటీవల హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుక్కుందట. కొన్నాళ్ల పాటు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం కెరీర్‌లో ఉన్నతస్థితిలో ఉందీ తార. హిందీలో ‘గుమ్రా’, ‘పూజా మేరీ జాన్’, ‘పిప్పా’, ‘ఆంఖ్ మిచోలి’ వంటి పలు క్రేజీ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
2023-03-18T22:04:36Z dg43tfdfdgfd