NATU NATU SONG | ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన జర్మన్‌ ఎంబసీ స్టాఫ్‌.. వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీందా

Natu Natu Song | దర్శకుడు ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు’ సాంగ్‌కు భారత్‌లోనే కాకుండా యావత్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల ఈ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు సైతం దాసోహమైంది. అంతేకాకుండా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు వరించాయి. ఈ పాటపై ఎంతో మంది ప్రముఖులు సాంగ్‌కు స్టెప్పులు లేశారు. తాజాగా జర్మన్‌ రాయబార ఎంబసీ సిబ్బందితో పాటు రాయబారి సైతం పాటకు కాళ్లు కదపడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలోని చాందిని చౌక్‌లో ఎంబసీ సిబ్బంది నాటునాటుకు పాటకు స్టెప్పులేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఎంబసీ కార్యాలయ సిబ్బంది డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా ట్వీట్‌ చేశారు. ‘చూస్తుంటే నాటు నాటు పాటకు ఎవరు బాగా డ్యాన్స్‌ చేస్తారో అని ఎంబసీ కార్యాలయాలు ఒలింపిక్స్‌ తరహాలు పోటీపడుతున్నట్లుంది’ అంటూ ఆనంద్‌ మహీంద్రా చమత్కరించారు. మరి ఈ వరుసలోనే తర్వాత డ్యాన్స్‌ చేసే ఎంబసీ ఏ దేశానికి చెందింది? అంటూ ట్వీట్‌ చేశారు. దాదాపు రెండు నిమిషాలకుపైగా ఉన్న వీడియో జర్మనీ రాయబారి అకెర్‌మాన్‌ నీలిరంగుకుర్తాలో చాందినీ చౌక్‌ వీధుల్లో సందడి చేశారు. డాన్స్‌కు సంబంధించిన వీడియోను సైతం ఆయన తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.

‘జర్మన్లు డాన్స్‌ చేయలేరా?.. నేను నా ఇండో జర్మన్‌ బృందం ఓల్డ్‌ ఢిల్లీలో ‘నాటు నాటు’ సాంగ్‌ ఆస్కార్‌ విజయోత్సవాన్ని జరుపుకున్నాం. పరిపూర్ణంగా లేదు కానీ.. సరదాగా! చేశాం అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కొరియన్‌ ఎంబసీ, రామ్‌చరణ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌మూవీ టీమ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఎవరు ఏ ఎంబసీ తర్వాత ‘నాటు నాటు’ సాంగ్‌కు డాన్స్‌ చేస్తుందంటూ సవాల్‌ విసిరారు. ఇంతకు ముందు దక్షిణ కొరియా ఎంబసీ సైతం డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. జర్మనీ ఎంబసీ సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రశంసలతో ముంచెత్తారు.

2023-03-19T13:20:03Z dg43tfdfdgfd