మణిరత్నం (Mani Ratnam) కాంపౌండ్ నుంచి వస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. ఇప్పటికే విడుదలైన పొన్నియన్ సెల్వన్-1 నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ భారీ మల్టీస్టారర్‌కు కొనసాగింపుగా పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2) కూడా వస్తుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత సీక్వెల్ నుంచి కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ వీడియోను షేర్ చేసింది మణిరత్నం టీం.
కార్తీ, త్రిషల సంగీత, ప్రేమ ప్రపంచంలోకి.. అంటూ గ్లింప్స్ వీడియోను లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. కార్తీ (Karthi), త్రిష (Trisha) మధ్య సాగే లవ్ ట్రాక్‌తో ఈ పాట ఉండబోతుందని మణిరత్నం హింట్ ఇచ్చినా..? ఇంతకీ కథలో భాగంగా ఏ టైంలో ఈ ట్రాక్ ఉండబోతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పొన్నియన్ సెల్వన్ -2లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిషతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫస్ట్ పార్టు లాగే పొన్నియన్ సెల్వన్-2 కూడా ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో వస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఆగనందే సాంగ్ గ్లింప్స్ వీడియో..
పొన్నియన్ సెల్వన్ 2 తారల చిట్ చాట్ సాగిందిలా..
RC 15 | గొప్ప అనుభూతినిస్తోంది.. ప్రభుదేవా టీం సర్‌ప్రైజ్‌పై రాంచరణ్
2023-03-19T13:35:04Z dg43tfdfdgfd