RAM CHARAN | యథార్థ కథలకే ఆదరణ

భారతీయ సాంస్కృతిక మూలాల్ని దృశ్యమానం చేసే కథలకే పాశ్చాత్య ప్రపంచం పట్టం కడుతున్నదని అన్నారు అగ్ర హీరో రామ్‌చరణ్‌. ఆస్కార్‌ వేడుక అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో భారతీయ సినిమా తీరుతెన్నులు, గ్లోబల్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాధించిన విజయానికి ఆ సినిమా కథకున్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యమే కారణమన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘లగాన్‌, బాహుబలి, ఆర్‌ఆర్‌ర్‌ వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ దక్కించుకున్నాయంటే ఆ సినిమాల్లో భారతీయ మూలాలుండటమే కారణం. భారతీయ జానపద, చారిత్రక కథలకు విదేశీయులు బ్రహ్మరథం పడుతున్నారు. దేశ సాంస్కృతిక మూలాల్ని ఆవిష్కరించే కథలు పాశ్చాత్య ప్రపంచంలో తిరుగులేని ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి’ అన్నారు.

2023-03-18T22:19:38Z dg43tfdfdgfd