రివ్యూ : రంగమార్తాండ (Rangamarthanda)
నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ తదితరులు..
ఎడిటర్: పవన్ వీకే
సినిమాటోగ్రఫీ: రాజన్ కే.నల్లి
సంగీతం: ఇళయరాజా
నిర్మాత : కే.మధు, ఎస్.వెంకట్ రెడ్డి
దర్శకత్వం: కృష్ణ వంశీ
విడుదల తేది : 22/3/2023
టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ‘కృష్ణ వంశీ’ నుంచి వచ్చిన తాజా సినిమా రంగమార్తండ. కరోనాకు ముందుకు ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులతో చివరకు షూటింగ్ కంప్లీటైంది. దాదాపు నాలుగైదేళ్లుగా కృష్ణవంీ ఈ సినిమా కోసం పనిచేసాడు. మరాఠీలో నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ మూవీకి తెలుగు రీమేక్ ‘రంగమార్తాండ’. మరి మరాఠీ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
రాఘవరావు (ప్రకాష్ రావు) తన వృత్తి జీవితంలో అత్యున్నత స్థితికి చేరుకున్న రంగస్థల నటుడు. కళకు ఆయన చేసిన సేవలకు గుర్తించి ఆయనకు రంగస్థలంపై మార్తాండుని వలె వెలుగుతున్న ఇతనికి ‘రంగమార్తాండ’ అనే బిరుదు కూడా ఇస్తారు. ఏ వృత్తిలోనైనా ఓ దశలో రిటైర్మెంట్ ఉంటుంది. ఈ దశలో తన ఆస్తిని పిల్లలైన కూతురు శ్రీ (శివాత్మిక రాజశేఖర్), మరియు కుమారుడు రంగా (ఆదర్శ్ బాలకృష్ణ)కు పంచుతాడు. అప్పటి వరకు అతన్ని ఓ రాజులా చూసుకున్న కుటుంబ సభ్యులు అతనిపై ప్రతి చిన్న పనికి చిన్నబుచ్చుతూ ఉంటారు. మొత్తంగా ఆస్తి పంచిన రంగమార్తాండ రాఘవరావు, తన ఫ్యామిలీ సభ్యులతో జరిగిన ఎమోషనల్ డ్రామానే ‘రంగమార్తాండ’ మూవీ స్టోరీ.
కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..
తెలుగులో అప్పటి వరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అవును కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాలు చూస్తే గతంలో ఎక్కడ చూడని కథా వస్తువునే తీసుకొని ఎంతో హృద్యంగా సినిమాలు తెరకెక్కించడం ఆయన శైలి. ఈ క్రమంలో దెబ్బలు తిన్న ఎక్కడ వెనకడుగు వేయలేదు. తాజాగా ఈయన మరాఠీలో నానా పాటేకర్ ముఖ్యపాత్రలో నటించి హిట్టైన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేసారు కృష్ణవంశీ. ఇక కృష్ణవంశీ నుంచి వచ్చిన మూడో రీమేక్. గతంలో నాగార్జునతో చేసిన ‘చంద్రలేఖ’ మూవీ కూడా మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు. ఆ తర్వాత తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంత:పురం’ సినిమాను హిందీలో ‘శక్తి’గా రీమేక్ చేసాడు. ఇపుడు మరోసారి ‘రంగమార్తాండ’ అనే అరువు కథలోని ఆత్మను తీసుకొని తనదైన శైలిలో తెరకెక్కించి దర్శకుడిగా మరోసారి తన ప్రతిభ ఏంటో చూపించాడు. ఈ సినిమాలో ఆత్మ కృష్ణవంశీని కనెక్ట్ కావడం.. దాన్ని అంతే హృద్యంగా సినిమాగా తెరకెక్కించాడు. మరోసారి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. మొత్తంగా ఈ సినిమాలో అడుగడున కృష్ణవంశీ మార్క్ కనబడుతోంది. రంగస్థలంపై రంగమార్తాండు వలె ఎలాంటి నటనను అలవోకగా చేసే రాఘవరావు నిజ జీవితంలో అసలు నటించడమే రాని వ్యక్తి జీవితాన్ని గుండెలు పిండేలా తెరపై చూపించాడు. చూసిన ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిండచం ఖాయం. ముఖ్యంగా తల్లిదండ్రులను వాళ్లు బతికున్నపుడే చక్కగా చూసుకోవాలి. పోయిన తర్వాత ఏడిచి లాభం లేదనే సందేశం ప్రతి ఒక్కరిని కదిలించేదనే చెప్పాలి.
ఈ సినిమాకు కథ, కథనం అన్ని బాగున్న.. ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా కమర్షియల్ అంశాలకు దూరంగా కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందనేది చూడాలి. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వంతో పాటు ఇళయరాజా సంగీతం అంతే చక్కగా కుదిరింది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఇంకాస్త మెరుగుగా ఉంటే బాగుండేది. ఎడిటర్ సెకండాఫ్‌లో ఎడిటర్ తన కత్తెరకు పదును పెడితే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
ప్రకాష్ రాజ్ ఎలాంటి నటుడుతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో రాఘవరావు పాత్రకు ప్రాణం పోసాడు. ఎపుడు నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం.. తన యాక్టింగ్‌తో గుండెలు పిండేసాడు. నవ్వించడమే కాదు.. ప్రేక్షకులను తనకు ఏడిపించడం కూడా తెలుసు అన్న విషయాన్ని మరోసారి రంగమార్తాండతో ప్రూవ్ చేసారు బ్రహ్మా. సెకండాఫ్‌లో రమ్యకృష్ణ నటన అద్భుతం. క్లైమాక్స్‌లో అది పీక్స్‌కు వెళ్లింది. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనపించారు.
ప్లస్ పాయింట్స్
కథ,
కృష్ణవంశీ టేకింగ్
నటీనటుల నటన
మైనస్ పాయింట్స్
స్లో గా సాగే కథనం
కమర్షియల్ హంగులకు దూరం
ఎడిటింగ్
చివరి మాట : ‘రంగమార్తాండ’.. కృష్ణవంశీ మార్క్ ఎమోషనల్ డ్రామా..
రేటింగ్ : 2.75/5
2023-03-22T08:28:37Z dg43tfdfdgfd