RC 15 | గొప్ప అనుభూతినిస్తోంది.. ప్రభుదేవా టీం సర్‌ప్రైజ్‌పై రాంచరణ్‌

ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) నుంచి నాటు నాటు బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ (Oscar) పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, లీడ్‌ యాక్టర్లు రాంచరణ్‌, తారక్‌, డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), రచయిత చంద్రబోస్‌ అండ్‌ టీంపై ప్రశంసలు వర్షం కురిపించారు. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా టీం ఇదే పాటకు స్టెప్పులేసి రాంచరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రాంచరణ్‌ నటిస్తున్న చిత్రం ఆర్‌సీ 15 (RC 15). తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాంచరణ్‌, కియారా అద్వానీపై వచ్చే సాంగ్ షూట్‌ మొదలైంది. అయితే ఆస్కార్ ఈవెంట్‌లో జక్కన్న టీం నాటు నాటు అవార్డు అందుకున్న తర్వాత రాంచరణ్‌ తిరిగి ఆర్‌సీ 15 సెట్స్‌లోకి రావడంతో.. అతడికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది ప్రభుదేవా అండ్ గణేశ్‌ మాస్టర్‌ టీం. ఆర్‌సీ సెట్స్‌ లోకి రాంచరణ్‌కు ఇలా నాటు నాటు స్వాగతం పలుకుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

ఇంత గొప్పగా సాదర స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సరిపోవు..మా గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్ స్వీట్ సర్‌ప్రైజ్‌ చేసినందుకు ధన్యవాదాలు . షూటింగ్‌కి తిరిగి రావడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందంటూ రాంచరణ్‌ ట్వీట్ చేశాడు.

ప్రభుదేవా టీం స్వాగతంపై రాంచరణ్‌ ఇలా..

2023-03-19T09:49:58Z dg43tfdfdgfd